ఛత్రపతి శివాజీకి “ఖడ్గాన్ని” ఇచ్చింది శ్రీశైలం భ్రమరాంబిక దేవి అని మీకు తెలుసా.? 1677 లో ఏం జరిగిందంటే.?

ఛత్రపతి శివాజీకి “ఖడ్గాన్ని” ఇచ్చింది శ్రీశైలం భ్రమరాంబిక దేవి అని మీకు తెలుసా.? 1677 లో ఏం జరిగిందంటే.?

by Harika

Ads

ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక దేవి ఎంతో ప్రసిద్ధి చెందినది. అష్టాదశ పీఠాలలో ఈ శ్రీశైల మల్లికార్జున ఆలయం ఒకటి. అయితే శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబికా దేవికి ఛత్రపతి శివాజీకి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో చాలా మందికి తెలియక పోవచ్చు. 1677వ సంవ‌త్స‌రంలో అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హ‌స‌న్ కుతుబ్ షాకు,చత్రపతి శివాజీకి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉండేది.

Video Advertisement

ఈ క్రమంలోనే శివాజీ ఒకసారి శ్రీశైలానికి వచ్చారు.అప్పటికి సుల్తాన్ ఆ స్థానం లో ఉన్నటువంటి మంత్రులు శివాజీకి సాదర ఆహ్వానం పలికారు. చత్రపతి శివాజీ తిరుగు పయనమయ్యే వరకు వారు తన వెంట ఉండి అతనికి అన్ని విషయాలలోనూ సహాయం చేశారు. ఇలా శివాజీ శ్రీశైల భ్రమరాంబిక ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ శివాజీ ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నించగా అప్పుడు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షమై తనకు ఒక ఖడ్గాన్ని ఇచ్చింది.

ఈ ఖడ్గం ఉన్నంత నీ దగ్గర ఉంటే నీకు విజయం కలుగుతుంది అని అమ్మవారు శివాజీ తో చెప్పింది. చత్రపతి శివాజీ ఆ ఖడ్గాన్ని అందుకున్న తరువాత జరిగిన ప్రతి యుద్ధంలోనూ విజయాన్ని అందుకున్నాడు. దీనంతటికీ కారణం శ్రీశైల భ్రమరాంబికా దేవి అని శివాజీ గట్టిగా నమ్మారు. అక్కడ తన సొంత ఖర్చుతో గుడి కట్టి ఆ ఆలయాన్ని శివాజీ సొంతంగా చూసుకునేవారు. పక్కనే ఉన్న కృష్ణా నది ఒడ్డున స్నానపు ఘాట్లని కూడా ఏర్పాటు చేశారు.

అక్కడ అమ్మవారికి రక్షణ కోసం తన రక్షకబటులను అక్కడ ఉంచి పయనమయ్యారు శివాజీ. ఇప్పటికీ శ్రీశైల బ్రమరాంబిక అమ్మవారి గోపురం మీద శివాజీ అమ్మవారి చేతుల మీదగా కత్తి తీసుకుంటున్నటువంటి బొమ్మలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఉన్న మ్యూజియంలో కూడా శివాజీ గురించి చాలా విశేషాలు తెలుసుకోవచ్చు. శివాజీ తన యుద్ధంలో విజయానికి కారణం శ్రీశైల అమ్మవారి అని గట్టిగా నమ్ముతూ ఆ గొప్పతనాన్ని అందరికీ చాటేవారు.


End of Article

You may also like