అన్న మీద కోపం తో అన్న ఇంటి ఎదురుగా 2 అడుగుల వెడల్పు తో ఇల్లు కట్టేసిన తమ్ముడు..అసలు కథ ఏంటంటే..?

అన్న మీద కోపం తో అన్న ఇంటి ఎదురుగా 2 అడుగుల వెడల్పు తో ఇల్లు కట్టేసిన తమ్ముడు..అసలు కథ ఏంటంటే..?

by Harika

Ads

అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు వస్తుండడం సహజమే. అయితే, ఈ రియల్ స్టోరీ లో తమ్ముడు మాత్రం అన్న పై కోపం తో నవ్వొచ్చే పని చేసాడు.

Video Advertisement

తమ్ముడి ఇంటి ఎదురుకుండా సముద్రం ఉండడం తో.. అన్న ఇంటికి ఎక్కువ వేల్యూ ఉంటుందని భావించి.. అన్నపై కోపం తో.. బీచ్ కి అన్న ఇంటికి మధ్యలో కేవలం రెండు అడుగుల వెడల్పు తో ఇల్లు కట్టేసాడు.

popular house 1

ప్రస్తుతం వీరి స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు కథ ఏంటో చూద్దాం.. లెబనాన్‌లోని బీరుట్‌కు సమీపం లో మనారా అనే సిటీ లో ఇద్దరు అన్నదమ్ములకు ఆస్తి పంపకాల విషయం లో గొడవలు వచ్చాయి. అన్న కు వచ్చిన ఆస్తి కంటే, తమ్ముడికి తక్కువ రావడం తో ఇద్దరికీ తగాదా వచ్చింది. ఈ క్రమం లో అన్న ఇల్లు కట్టుకున్నాడు.. తమ్ముడికేమో చాలా తక్కువ స్థలం వచ్చింది. దీనితో, తమ్ముడు అన్న పై అసంతృప్తి గా ఉన్నాడు. అన్న కట్టిన ఇల్లు బీచ్ కి ఎదురుగా ఉంది. ఆ ఇంట్లోంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది.

popular house 2

దీనితో, ఆ ఇంటికి డిమాండ్ బాగా పెరిగింది. తన ఇంటికంటే అన్న ఇంటికే ఎక్కువ డిమాండ్ ఉండడం తో తమ్ముడు జెలస్ ఫీల్ అయ్యాడు. దీనితో, తమ్ముడు ఆ బీచ్ కి, అన్న ఇంటికి మధ్య లో ఉన్న కొద్దీ స్థలం లోనే ఇల్లు కట్టాడు. కేవలం రెండు అడుగుల వెడల్పు తో మరో వైపు 14 అడుగుల వెడల్పు తోనే ఇల్లు కట్టేసాడు. ఈ ఇల్లు చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ, అందులో అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాడు. ఈ ఇంటిని 1954 లో కట్టారని చెబుతున్నారు. అక్కడివారు ఆ ఇంటిని “విద్వేష భవనం” అని పిలుచుకుంటుంటారు. ఇంత సన్న గా ఉన్నా లెబనాన్ లో ఈ ఇల్లు బాగా పాపులర్ హౌస్ అట.


End of Article

You may also like