పసి పిల్లలని చూడగానే ముద్దు పెట్టేసుకోవాలనిపించేంత ముద్దు గా ఉంటారు. అయితే.. వారిలో నరాలు పూర్తి స్థాయిలో బలం గా ఉండవు. అందుకే నెత్తి పైన చెయ్యిని బలం గా వేసి ఉంచకూడదు అని చెబుతూ ఉంటారు
అయితే.. కొందరు పసిపిల్లల చెవి పై కూడా ముద్దు పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే వారికి శాశ్వతం గా చెవుడు వచ్చే అవకాశం ఉంది అని చెబుతూ ఉంటారు.
హెంప్స్టెడ్ లోని హోఫ్స్ట్రా విశ్వవిద్యాలయంలో ఆడియాలజీ ప్రొఫెసర్ జో ఫీల్డ్స్ ఈ విషయమై వివరణ ఇచ్చారు. సాధారణం గా చెవి, ముక్కు వంటి ముఖం పై ఉండే ప్రాంతాలు సున్నితం గా ఉంటాయి. పసిపిల్లలలో ఇవి ఇంకా సున్నితం గా ఉంటాయి.
పసిపిల్లల చెవులపై తెలిసి తెలియక ముద్దు పెట్టుకోవడం వలన వారి చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వారికి చెవిపోటు మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిని “కోక్లియర్ ఇయర్-కిస్-ఇంజురీ” అని పిలుస్తారు.
ఇలా చెవి నరాలపై ఒత్తిడి పడటం మూలం గా శాశ్వత చెవుడు, చెవిపోటు, చెవిలోంచి శబ్దాలు రావడం, ధ్వని వినడానికి అవసరమైన సున్నితమైన పొరలు దెబ్బతినడం వంటి ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
హోఫ్స్ట్రా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ లెవి రైటర్ ఈ విషయమై అధ్యయనం చేస్తున్నారు. ఓ ఐదేళ్ల క్రితం ఆయన వద్దకు ఓ మహిళా వచ్చింది.
తన ఐదేళ్ల బిడ్డను చెవి పై ముద్దు పెట్టుకుని తరువాత.. ఆ బేబీ చెవుడు ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తాను గమనించి ప్రొఫెసర్ కు చెప్పడం తో.. ఆయన ఈ విషయమై పరిశోధన చేస్తున్నారు.