పసిపిల్లల చెవి పై ముద్దు పెడితే వారికి చెవుడు వస్తుందా..? ఇందులో నిజమెంత..?

పసిపిల్లల చెవి పై ముద్దు పెడితే వారికి చెవుడు వస్తుందా..? ఇందులో నిజమెంత..?

by Anudeep

Ads

పసి పిల్లలని చూడగానే ముద్దు పెట్టేసుకోవాలనిపించేంత ముద్దు గా ఉంటారు. అయితే.. వారిలో నరాలు పూర్తి స్థాయిలో బలం గా ఉండవు. అందుకే నెత్తి పైన చెయ్యిని బలం గా వేసి ఉంచకూడదు అని చెబుతూ ఉంటారు. అయితే.. కొందరు పసిపిల్లల చెవి పై కూడా ముద్దు పెట్టుకోకూడదు, అలా పెట్టుకుంటే వారికి శాశ్వతం గా చెవుడు వచ్చే అవకాశం ఉంది అని చెబుతూ ఉంటారు. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం..

Video Advertisement

baby ear 1

హెంప్‌స్టెడ్ లోని హోఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయంలో ఆడియాలజీ ప్రొఫెసర్ జో ఫీల్డ్స్ ఈ విషయమై వివరణ ఇచ్చారు. సాధారణం గా చెవి, ముక్కు వంటి ముఖం పై ఉండే ప్రాంతాలు సున్నితం గా ఉంటాయి. పసిపిల్లలలో ఇవి ఇంకా సున్నితం గా ఉంటాయి. పసిపిల్లల చెవులపై తెలిసి తెలియక ముద్దు పెట్టుకోవడం వలన వారి చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వారికి చెవిపోటు మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిని “కోక్లియర్ ఇయర్-కిస్-ఇంజురీ” అని పిలుస్తారు.

baby ear 2

ఇలా చెవి నరాలపై ఒత్తిడి పడటం మూలం గా శాశ్వత చెవుడు, చెవిపోటు, చెవిలోంచి శబ్దాలు రావడం, ధ్వని వినడానికి అవసరమైన సున్నితమైన పొరలు దెబ్బతినడం వంటి ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హోఫ్‌స్ట్రా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ లెవి రైటర్ ఈ విషయమై అధ్యయనం చేస్తున్నారు. ఓ ఐదేళ్ల క్రితం ఆయన వద్దకు ఓ మహిళా వచ్చింది. తన ఐదేళ్ల బిడ్డను చెవి పై ముద్దు పెట్టుకుని తరువాత.. ఆ బేబీ చెవుడు ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తాను గమనించి ప్రొఫెసర్ కు చెప్పడం తో.. ఆయన ఈ విషయమై పరిశోధన చేస్తున్నారు.

baby ear 3

ఈ పరిశోధనలో 1950 లలోనే ఇలాంటి ఓ కేసు ఉన్నట్లు ఆయన కనుక్కున్నారు. “కిస్ ఆఫ్ డెఫ్” అనే అంశం పై “న్యూస్ డే” లో రాయబడ్డ ఓ కధనాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ విషయమై మరింత లోతు గా పరిశోధనలు జరిపాడు. అతని పరిశోధనల ఫలితంగా.. ప్రపంచవ్యాప్తం గా ఇలా ముద్దు పెట్టుకోవడం కారణాం చెవిటి సమస్యను ఎదుర్కొంటున్న ముప్పై మంది బాధితులను ఆయన గుర్తించారు. ఆయన ఇందుకు సంబంధించిన పరిశోధనలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీ మరియు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ ఒటోరినోలారింగాలజీ లకు సమర్పించబోతున్నారు.

baby ear 4

ఒక్క మాటలో చెప్పాలంటే.. పసిపిల్లలకు నరాలు పూర్తిగా బలం గా ఏర్పడవు. అందుకే వారిని ఎక్కువ జాగ్రత్తగా పొదివి పట్టుకోవాలి. వారి శరీరం లోని భాగాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. చివరకు వారిని ముద్దు పెట్టుకున్నా కూడా ఎంతో సున్నితం గా చేయాలి. ముఖ్యం గా చెవి, ముక్కు, కళ్ళు, మెదడు వంటి భాగాలు సున్నితం గా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా చుంబించాలి. లేదంటే.. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


End of Article

You may also like