మీరెప్పుడైనా గమనించారా..? లారీలు, ట్రక్ లు వెళ్తున్నప్పుడు వాటికి వెనకాల టైర్స్ కి కొద్దిగా పైన రబ్బర్ స్ట్రిప్స్ వేలాడుతూ ఉంటాయి.. ఇవి ఎందుకు ఉంటాయి..? అన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..?
లారీలను డెకరేట్ చేయడానికి మాత్రం కాదు. వీటి వల్ల ఓ ఉపయోగం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా లారీలు గాని ట్రక్కులు గాని ఎక్కువ వేగం గా వెళ్తూ ఉంటాయి. ఆ సమయం లో టైర్ కి రోడ్డు కు మధ్య ఘర్షణ (friction) ఏర్పడుతుంది.. టైర్లు చాలా వేడిగా అయిపోతూ ఉంటాయి.
అలాంటి టైం లో ఈ వేలాడుతున్న రబ్బర్ స్ట్రిప్స్ గాలికి అటూ ఇటూ ఊగుతూ టైర్లకి తగులుతాయి. అప్పుడు ఆ రబ్బర్ స్ట్రిప్స్ వేడికి కొంత కరిగిపోయి టైర్ కి అతుక్కుంటాయి. అలా వేడి వల్ల టైర్లు పాడవకుండా.. ఈ రబ్బర్ స్ట్రిప్స్ నల్లగా కరిగి పడడం వలన అందం గా కనిపిస్తాయి.
కొన్ని చోట్ల మంచు కురిసే ప్రాంతాలలో.. డ్రైవింగ్ చేస్తూ టైర్లు ఎలా తిరుగుతున్నాయి అన్న విషయాన్నీ సైడ్ మిర్రర్ లో చూడడం సాధ్యం కాదు. అందుకోసం వీటిని ఏర్పాటు చేస్తారు. వీటి లెంగ్త్ ని బట్టి డ్రైవర్లు టైర్ల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ఉంటారు. అయితే.. భారత్ లాంటి దేశాలలో మంచు కురవదు కాబట్టి కేవలం టైర్లను నీట్ గా ఉంచుకోవడం కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తారు.