మన ఇండస్ట్రీలో ఎంతో మంది బయట నుంచి వచ్చిన హీరోలు ఉంటారు. అలాగే తమ కుటుంబం ద్వారా సినిమాల్లోకి వచ్చిన నటులు కూడా ఉంటారు. ఎలా వచ్చినా కానీ, ఎంతో కష్టపడి వాళ్ళ నటనతో ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించుకుంటారు. అలా ఒక ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి నందమూరి కుటుంబానికి చెందినవారు. ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమ రావు గారి కుమారుడే కళ్యాణ్ చక్రవర్తి.

Video Advertisement

తండ్రి, పెద్ద నాన్న సినీ రంగం లోనే ఉండేసరికి చిన్నతనం నుండి కళ్యాణ్ చక్రవర్తి నటుడు అవ్వాలని అనుకున్నారట. 1986 లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కళ్యాణ్ చక్రవర్తి. ఆ తర్వాత ఇంటి దొంగ, తలంబ్రాలు, మామ కోడళ్ళ సవాల్, మారణహోమం, రౌడీ బాబాయ్, ప్రేమ కిరీటం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి చివరిగా 2003 లో విడుదలైన కబీర్ దాస్ సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు.

did you remember hero kalyan chakravarti..

 

అయితే తాజాగా నందమూరి తారకరత్న చనిపోయినపుడు.. అంత్యక్రియల సమయం లో కళ్యాణ్ చక్రవర్తి గారు కనిపించారు. హైదరాబాద్ వచ్చిన ఆయన తారక రత్న నివాసం వద్ద కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లను కళ్యాణ చక్రవర్తి పలకరిస్తున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలం తర్వాత నందమూరి కళ్యాణ చక్రవర్తి కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. అప్పటికి ..ఇప్పటికి చాలా మారిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత సినిమాల్లో తండ్రి పాత్రలకు సరిగా సరిపోతారు.. మళ్ళీ సినిమాల్లోకి రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్.

did you remember hero kalyan chakravarti..

అయితే కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం, అలాగే కొన్ని సినిమాల్లో నటించిన కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు అయిన హరీన్ చక్రవర్తి కూడా ప్రాణాలను కోల్పోవడం, అదే ప్రమాదం లో త్రివిక్రమరావు గారికి గాయాలు అవ్వడంతో కళ్యాణ్ చక్రవర్తి గారు తండ్రిని చూసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయారు. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ హైదరాబాద్ కి తిరిగి రాలేదు. చెన్నైలోనే వ్యాపారాలు చూసుకుంటూ ఉండిపోయారు. ఈయన సినిమాల్లో కొనసాగి ఉంటే పెద్ద స్టార్ అయ్యి ఉండేవారని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.