ఇదేందయ్యా ఇది…”భరత్ అనే నేను” లోని పాటలో ఈ సీన్ ఎప్పుడైనా గమనించారా.?

ఇదేందయ్యా ఇది…”భరత్ అనే నేను” లోని పాటలో ఈ సీన్ ఎప్పుడైనా గమనించారా.?

by Mohana Priya

Ads

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా భరత్ అనే నేను సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సినిమా వచ్చి రెండేళ్లయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం.

Video Advertisement

ఈ సినిమాలో భరత్ సీఎం అయిన తర్వాత వసుమతి ని చూస్తాడు. తర్వాత వసుమతి తో మాట్లాడుతాడు. సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వసుమతి, తన స్టడీలో భాగంగా భరత్ ఆఫీస్ కి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు ” ఇది కలలా ఉన్నదే” పాట వస్తుంది. కింద ఉన్న స్టిల్ ఆ పాట లోది. ఇక్కడ మీరు గమనిస్తే వెనకాల ఉన్న కార్స్ అన్ని బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

ఇప్పుడు ఈ షాట్ గమనించండి. ఇది పైన మెన్షన్ చేసిన దానికి కంటిన్యూషన్ షాట్. కానీ రెండిట్లో తేడా ఏంటో ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఒక షాట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న కార్స్, నెక్స్ట్ షాట్ లో వైట్ కలర్ లో ఉంటాయి.

మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు.

వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.


End of Article

You may also like