మధ్యరాత్రి నిద్రలో ఉన్నప్పుడు మెలుకువ వస్తోందా..? అందుకు కారణం ఏంటో తెలుసా..?

మధ్యరాత్రి నిద్రలో ఉన్నప్పుడు మెలుకువ వస్తోందా..? అందుకు కారణం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

నిద్ర అనేది ఒక మనిషికి చాలా ముఖ్యమైనది. రోజు అంతా ఒక మనిషి ఎంతో పని చేస్తాడు. అంతే చురుగ్గా మరుసటి రోజు కూడా పని చేయాలి అంటే కచ్చితంగా నిద్ర ఉండాలి. అప్పుడే మెదడు విశ్రాంతి తీసుకొని, మళ్ళీ రీఛార్జ్ అయి పని చేస్తుంది. అదే నిద్ర లేకున్నా పని చేస్తే మాత్రం అది పని మీద కూడా ప్రభావం చూపుతుంది. విసుగు, చిరాకు వంటివి ఎక్కువగా వస్తాయి. అందుకే మనిషి నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. అది కూడా కేవలం ఒకటి, రెండు గంటలు మాత్రమే కాకుండా దాదాపు 7, 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడే మెదడుకి విశ్రాంతి దొరుకుతుంది.

Video Advertisement

Sleeping-With-A-Pillow

తక్కువ నిద్రపోయినా కూడా ఆ అలసట మన మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఎక్కువసేపు నిద్రపోవాలి. అప్పుడే పని కూడా ప్రభావవంతంగా చేయగలుగుతారు. అయితే, నిద్రపోతున్నప్పుడు మీకు ఎప్పుడైనా మధ్య రాత్రి మెలకువ వస్తుందా? ఏదైనా అత్యవసరం అయ్యి లేచినప్పుడు వేరే విషయం. అలా కాకుండా తరచుగా మధ్యరాత్రి మెలకువ వస్తోంది అంటే దానికి ఒక కారణం ఉంది. టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా ఒక మనిషి టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు రోజంతా చాలా వాడుతూ ఉంటారు. ఫోన్లు, టీవీ, లాప్ టాప్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులోనే ఒక మనిషి వాడుతున్నారు. ఈ కారణంగా వాటి నుండి వచ్చే మెలటోనిన్ వల్ల నిద్రకి ఆటంకం కలుగుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు ఇలాంటి డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలి. అప్పుడే వాటి ప్రభావం మన నిద్ర మీద పడదు. అంతేకాకుండా నిద్రపోయే కొద్దిసేపటి ముందు కాఫీ, టీ ఇలాంటివి తీసుకోకూడదు. కఫైన్ లాంటివి తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా రాదు. దాంతో పడుకున్నప్పుడు నిద్రకి ఆటంకం కలుగుతుంది. ఎంత ప్రయత్నించినా కూడా నిద్ర రాదు. నిద్రపోయే గది శుభ్రంగా, చీకటిగా ఉండేలాగా చూసుకోవాలి. దోమల లాంటివి ఎక్కువగా ఉండకుండా కూడా చూసుకోవాలి. గాలి బాగా వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి దుర్వాసనలు కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి. గది వాతావరణం ప్రశాంతంగా ఉంటే నిద్ర బాగా పడుతుంది. ఆటంకం లేకుండా నిద్రపోతే మరుసటి రోజు పని బాగా చేసుకుంటారు.

ALSO READ : పిల్లలు పుట్టినా పరిస్థితి మారలేదు… చనిపోవాలి అనుకుని..? ఈ IAS అధికారి కథ తెలుసా..?


End of Article

You may also like