రాత్రిపూట “పిక్కలు” పట్టేస్తున్నాయా.? అయితే జాగ్రత్త! మీలో ఈ మార్పులు జరుగుతుందని అర్ధం.!

రాత్రిపూట “పిక్కలు” పట్టేస్తున్నాయా.? అయితే జాగ్రత్త! మీలో ఈ మార్పులు జరుగుతుందని అర్ధం.!

by Harika

Ads

చాల మందికి రాత్రి నిద్ర పోయినప్పుడు కాళ్ళు పెట్టేస్తూ ఉంటాయి. కొంకర్లు పోయినట్లు అవుతూ ఉంటుంది. అయితే రాత్రిపూట ఎందుకు మోకాళ్ళు పట్టేస్తూ ఉంటాయి. మీకు కూడా రాత్రిపూట మోకాళ్ళు లాగుతూ ఉంటాయా..?, పిక్కలు పట్టేస్తూ  ఉంటాయా..? అయితే జాగ్రత్తగా ఉండాలి.

Video Advertisement

ఎక్కువగా ఇలాంటి సమస్యలు పెద్దవాళ్లలో కనబడుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఇటువంటి సమస్యలు వస్తున్నాయి.

పిక్కలు పట్టేయడానికి కారణాలు:

#1. ఇటువంటి సమస్యలు రావడానికి గల కారణం ఎక్కువసేపు కూర్చోవడం. సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. శారీరక వ్యాయామం కచ్చితంగా ఉండాలి.

#2.  వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాయామం సరిగా లేకపోవడం వల్ల రాత్రిపూట మోకాలు నొప్పి పెట్టడం, పిక్కలు పట్టేయడం వంటివి జరుగుతుంటాయి.

#3. మోకాళ్ళకి సంబంధించి వ్యాయామ పద్ధతులు అనుసరించడం వల్ల ఈ సమస్య నుండి బయట పడేందుకు అవుతుంది.

#4. అలానే ఇంటి చిట్కాలను ఫాలో అవడం వలన కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఏదైనా నూనె రాయడం లేదంటే మీ పెద్దలు చెప్పిన చిట్కాలను ఫాలో అవడం మంచిదే.

#5. కొంత మందిలో మెగ్నీషియం తగ్గడం వలన కూడా ఇలా జరుగుతుంది అని అంటుంటారు.

#6. ఏదైనా లోపం ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

#7.  కానీ ఎక్కువ ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా ఆర్థోపెడిక్ ని కన్సల్ట్ చేయండి.

మోకాళ్ళ నొప్పులను తగ్గించే మార్గాలు:

ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే శశాంకాసనం వేయడం మంచిది. దీని వల్ల మోకాళ్లు బలపడతాయి. అవయవానికి రక్త ప్రసరణ జరిగి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతుంది. అదే పెద్దవాళ్లలో మనం చూస్తే వయసు పెరగడం వల్ల ఈ సమస్య కలగొచ్చు.

వ్యాయామ పద్ధతుల్ని పాటించడం ఎంతో అవసరం:

ఇది వరకు అయితే 70 ఏళ్లు 60 ఏళ్లు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వచ్చేవి. అయితే ఇప్పుడు మాత్రం మూడు పదులు దాటితే చాలు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే వ్యాయామ పద్ధతుల్ని పాటించడం, టెంపరరీగా సమస్యను దూరం చేసే చిట్కాలను పాటించడం మంచిది. అప్పుడు అప్పటికప్పుడు మనకి రిలీఫ్ కలుగుతుంది.


End of Article

You may also like