“హార్ట్ ఎటాక్” వచ్చినప్పుడు…ప్రాణాలు కాపాడటానికి హాస్పిటల్ కన్నా ముందు ఇలా చేయండి.!

“హార్ట్ ఎటాక్” వచ్చినప్పుడు…ప్రాణాలు కాపాడటానికి హాస్పిటల్ కన్నా ముందు ఇలా చేయండి.!

by Mohana Priya

Ads

మనలో ఎక్కువ శాతం మంది ఎదుర్కునే ఆరోగ్య సమస్యల్లో గుండెకు సంబంధించిన సమస్యలు ఒకటి. అందులోనూ ముఖ్యంగా గుండెపోటు. ఈ గుండెపోటు తీవ్రత మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. కొంత మందికి అధికంగా వస్తే కొంత మందికి మామూలు గుండెపోటు వస్తుంది. చిన్న చికిత్స ద్వారా ఇది నయమవుతుంది.

Video Advertisement

Precautions to be taken during heart stroke

కానీ ఒకసారి గుండెపోటు వచ్చిందంటే తర్వాత ఆహార విషయాల్లోనూ, అలాగే ఆరోగ్య సంబంధిత విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. గుండెపోటు ఎక్కువగా రావడానికి కారణం ఒత్తిడి ఎక్కువ అవ్వడం, అలాగే వయసు సంబంధిత సమస్యలు. అంతే కాకుండా మనం తీసుకునే ఆహారం కూడా గుండెపోటు తీవ్రతకి ఒక కారణం అవుతుంది.

Precautions to be taken during heart stroke

గుండెపోటు అనేది కేవలం ఒకే వయసుకు సంబంధించిన వారికి మాత్రమే వస్తుంది అనే ఒక అపోహ ఉంటుంది. కానీ కాదు. గుండెపోటు లక్షణాలు అన్ని వయసుల వారికి వస్తాయి. ఎందుకంటే ఒత్తిడి అనేది కేవలం మధ్యవయస్కులకి లేదా పెద్ద వారికి మాత్రమే కాకుండా యువతకు కూడా ఎక్కువగా ఉంటుంది.

Precautions to be taken during heart stroke

అలా ఒత్తిడికి గురైనప్పుడు, లేదా మన శరీరంలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు మొదటిగా ప్రభావం అయ్యేది గుండె. అందుకే యువతకి కూడా గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఉంటోంది. గుండెపోటు వచ్చే ముందు ఎడమ చేయి నొప్పి పుట్టడం, గుండె ముందు భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

Precautions to be taken during heart stroke

ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే అది గుండెపోటు అని నిర్ధారించుకుంటాం. గుండెకి కరొనరీ ధమనులు రక్తం సరఫరా చేస్తాయి. పెద్దవాళ్ళకి, అలాగే స్థూలకాయం, షుగర్, కొలెస్ట్రాల్, బీపీ ఉన్నవాళ్లకి కొవ్వు ఈ కరొనరీ ధమనుల్లో పేరుకుపోయి అవి పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ మూసుకుపోతాయి. అక్కడ ఉండే మూడు రక్తనాళాలు అలా పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ మూసుకుపోయినప్పుడు గుండె నొప్పి అనేది వస్తుంది.

Precautions to be taken during heart stroke

యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అలా కొవ్వు పేరుకుపోదు. ఈ మూడు రక్తనాళాలు ముడుచుకుపోవడం వల్ల గుండె నొప్పి వస్తుంది. మనకి నొప్పి మొదలైనప్పుడు అది గుండెనొప్పి ఏమో అని అనుమానం రాగానే సార్బిట్రేట్ అనే టాబ్లెట్ తీసుకొని నాలుక కింద పెట్టుకోవాలి. టాబ్లెట్ పెట్టుకున్న 5 నిమిషాలలోపు నొప్పి తగ్గితే అది గుండెనొప్పే.

Precautions to be taken during heart stroke

గుండె నొప్పికి ఇంట్లో చికిత్స చేయకూడదు. వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ఆంబులెన్స్ లో గుండె నొప్పి ప్రథమ చికిత్సకు సంబంధించిన పరికరాలు ఉంటాయి. కానీ ఒక వేళ గుండె ఇంట్లో ఉన్నప్పుడే ఆగిపోతే, అంటే ఆ వ్యక్తి ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నట్టు, లేదా నాడి ఆగిపోయినట్టు అనిపిస్తే, ఆ వ్యక్తిని నేలమీద పడుకోబెట్టాలి. చుట్టూ గుంపుగా జనం ఉండకుండా వ్యక్తికి గాలి ఆడేటట్టుగా చూసుకోవాలి.

Precautions to be taken during heart stroke

ఆ వ్యక్తిని నేల మీద పడుకోబెట్టి మన చేతి మీద మరొక చేతిని పెట్టి గుండెకి ముందు వైపున ఉండే ఎముక మీద మన బరువు అంతా పెట్టి నిలబడి గట్టిగా నొక్కాలి. అలా గట్టిగా నొక్కడం ద్వారా గుండె ఒత్తిడికి గురయ్యి ఆ గుండె నుంచి రక్తం పారుతుంది. అలా ఒత్తిడికి గురవ్వడం ద్వారా ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది. దీనిని కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) అని అంటారు.

Precautions to be taken during heart stroke

అలాగే గుండె నొక్కుతూనే మధ్య మధ్యలో నోట్లోకి గాలి ఊదాలి. గాలి ఊదేటప్పుడు కర్చీఫ్ పెట్టుకుని ఊదటం మంచిది. అయితే షుగర్ ఉన్న వారిలో ఈ నొప్పి అంత ఎక్కువగా ఉండదట. గుండె నొప్పి వచ్చిన వారికి, గుండెకి రక్తం సరఫరా చేసే కరొనరీ ధమనుల్లో రక్తం గడ్డకట్టుకుపోతే ఆ గడ్డలను కరిగించడానికి స్టెప్టోకైనేస్ అనే పద్ధతిని వాడతారు. దీనిని ఎస్టీకే చికిత్స అంటారు.

Precautions to be taken during heart stroke

సాధారణంగా మందుని ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. అలా మందు శరీరంలోకి ఎక్కించడం ద్వారా కరొనరీ ధమనుల్లో ఉన్న రక్తం గడ్డ కరిగిపోయి తొందరగా కోలుకుంటారు. కొన్ని సందర్భాల్లో యాంజియోగ్రామ్ చికిత్స చేస్తారు. ఒకవేళ గుండె పోటు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ సమయంలో ఏం చేయాలి? అనే విషయం వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.

watch video :


End of Article

You may also like