Home Filmy Adda NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!

NRI లను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడ్డ 6 మంది టాలీవుడ్ హీరోయిన్లు…లిస్ట్ ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

మన ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు తమ కో-యాక్టర్స్ ని, లేదా ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకున్నారు. కానీ కొంత మంది మాత్రం ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులని పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంత మంది ఎన్నారై లని పెళ్లి చేసుకున్నారు. అలా ఎన్నారై లని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రంభ

హీరోయిన్ రంభ, కెనడాకు చెందిన ఇంద్రన్ ని 2010 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు.

Actresses who married NRI

#2 మీరా జాస్మిన్

మీరా జాస్మిన్ దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ టైటస్ ని పెళ్లి చేసుకున్నారు.

Actresses who married NRI

#3 మాధవి

సీనియర్ నటి మాధవి వ్యాపారవేత్త అయిన రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు. రాల్ఫ్ శర్మ తండ్రి జర్మనీకి చెందిన వారు తండ్రి భారత దేశానికి చెందిన వారు వీరిద్దరూ ఇప్పుడు న్యూజెర్సీలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.

Actresses who married NRI

#4 లయ

లయ ఎన్నారై అయిన శ్రీ గణేష్ ని పెళ్లి చేసుకున్నారు. శ్రీ గణేష్ ఒక డాక్టర్. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో చిన్నప్పటి ఇలియానాగా నటించింది.

Actresses who married NRI

#5 గోపిక

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాతో తెలుగు వారికి ఎంతో దగ్గరైన గోపిక, ఎన్నారై అజిలేష్ చాకో ని పెళ్లి చేసుకున్నారు వీరు ఆస్ట్రేలియా లో నివసిస్తున్నారు.

Actresses who married NRI

#6 అపర్ణ

సుందరకాండ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అపర్ణ, ఎన్నారై అయిన శ్రీకాంత్ ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు ఉన్నాడు. వీరు అమెరికాలో నివసిస్తున్నారు.

Actresses who married NRI

You may also like