మళ్లీ బాలయ్యను టార్గెట్ చేసిన హైపర్ ఆది…ఫైర్ అవుతున్న బాలయ్య ఫాన్స్..!

మళ్లీ బాలయ్యను టార్గెట్ చేసిన హైపర్ ఆది…ఫైర్ అవుతున్న బాలయ్య ఫాన్స్..!

by Megha Varna

Ads

లాక్ డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే.కాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని నియమాలతో కొంతమందితో మాత్రమే షూటింగ్స్ చేసుకొనేలా అనుమతిని ఇచ్చాయి.దీంతో టీవీ షూటింగ్స్ శరవేగంగా మొదలయ్యాయి.అయితే బుల్లితెరపై ఎంతో జనాదరణ కలిగిన కామెడీ షో జబర్దస్త్ ఎపిసోడ్స్ కూడా షూటింగ్స్ జరిగాయి.అయితే జబర్దస్త్ రాబోయే ఎపిసోడ్స్ యొక్క ప్రోమోలను ఈటీవీ ఇటీవల విడుదల చేసింది.అయితే ఆ ప్రోమోలో హైపర్ ఆది చెప్పిన హీరో బాలకృష్ణ డైలాగ్ డైలాగ్ కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది ..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..

Video Advertisement

జబర్దస్త్ ప్రేక్షకులు ఎక్కువగా హైపర్ ఆది పంచు డైలాగ్స్ ను ఇష్టపడతారు.బుల్లితెరమీదే కాకుండా యూట్యూబ్ లోను ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి హైపర్ అది స్కిడ్స్ .అయితే లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల నుండి జబర్దస్త్ ప్రసారం కాలేదు.దీంతో టిఆర్పి రేటింగ్స్ బాగా పడిపోయాయి.లాక్ డౌన్ తర్వాత తిరిగి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్స్ కు సంభందించిన ప్రోమోస్ ను ఈటీవీ ఇటీవల విడుదల చేసింది.కాగా ఆ ప్రోమో లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.అయితే ఇటీవల విడుదల అయిన బాలకృష్ణ ,బోయపాటి చిత్రంలోని ఒక డైలాగ్ ను హైపర్ ఆది తనకు అనుగుణంగా మలుచుకొని స్కిడ్ లో చెప్పారు.

“ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో” అంటూ బాలకృష్ణ తన స్టైల్ లో చెప్పిన డైలాగ్ ను ఆది తన స్కిడ్ కోసం ఇలా వాడుకున్నారు…”ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..ఆది గారికి మా జంటను చుస్తే కుళ్ళులా ఉంది అనడానికి ..ఆది గారు మా కుళ్లిపోయిన జంట ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లక్డి కపూర్” అంటూ తన కామెడీ టైమింగ్ తో చెప్పారు హైపర్ ఆది.అయితే ఇంతకముందు కూడా బాలకృష్ణ డైలాగ్స్ ను పలుసార్లు ఉపయోగించుకున్నారు హైపర్ ఆది.

అయితే బాలకృష్ణ డైలాగ్స్ ను కామెడీ గా మలిచినందుకు గాను బాలయ్య అభిమానుల నుండి వార్నింగ్ లు ఎదుర్కొన్నారు హైపర్ ఆది.అయితే ఇప్పుడు హైపర్ ఆది స్కిడ్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ..

Watch Video: >>>CLICK HERE<<<


End of Article

You may also like