బిగ్ బాస్ షోపై “ఝాన్సీ” సంచలన కామెంట్స్…తెలిసితెలిసి పళ్ళు రాలగొట్టుకుంటారా?

బిగ్ బాస్ షోపై “ఝాన్సీ” సంచలన కామెంట్స్…తెలిసితెలిసి పళ్ళు రాలగొట్టుకుంటారా?

by Megha Varna

Ads

బుల్లితెరపై మొదలైన కొన్ని షోస్ మాత్రమే ప్రజాదరణ పొందుతాయి.అందులో మరికొన్ని షోస్ చాలా వైవిధ్యంగా ఉంటూ ఎప్పటికి ప్రేక్షకులకి గుర్తిండిపోతాయి.అలంటి షోస్ లో బిగ్ బాస్ అత్యంత జనాదరణ పొందిన రియాలిటీ షో.ఈ షో మొదలైనప్పటి నుండి టి ఆర్ పి రేటింగ్స్ లో అన్ని షోస్ కంటే ముందు ఉంటూ వచ్చింది.ఈ షో లో పాల్గొనాలని దేశం మొత్తంమీద చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు.

Video Advertisement

కాగా తాజా నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా అందరూ సామాజిక దూరం పాటించాలంటూ సినిమా థియేటర్’స్ కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.దీని వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ నష్టం వాటిలింది. థియేటర్ టికెట్స్ మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ టాక్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి రావట్లేదు.కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇంటికే పరిమితం కావడం వలన టీవీ బాగా ఎక్కువగా చూస్తున్నారు.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 మొదలుపెడితే ఎలా ఉంటుంది అని బిగ్ బాస్ నిర్వాహకులు భారీ రేంజ్లో ప్లానింగ్ చేస్తున్నారు.కాగా ఈ మధ్యకాలంలో ఓ మీడియా ఛానల్ తో ముచ్చటిస్తున్న యాంకర్ ఝాన్సీని బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా అని అడగగా ఝాన్సీ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు …వివరాల్లోకి వెళ్తే …

సామాన్యుల నుండి సెలెబ్రెటీ ల దాక అందరూ బిగ్ బాస్ లో కనిపిస్తే జనాలలో బాగా టచ్ లో ఉంటూ ఫేమస్ అవ్వచ్చు అని ఆలోచిస్తారు ..కానీ యాంకర్ ఝాన్సీ మాత్రం దానికి బిన్నంగా ఆలోచించారు.బిగ్ బాస్ మొదలుపెట్టినప్పుడు మొదటి సీజన్లోనే అవకాశం వచ్చినా వెళ్లలేదని అలాంటిది ఇప్పుడు ఎలా వెళ్తానని ప్రశ్నించారు.ఎవరైనా కావాలని పళ్ళు రాలకొట్టుకుంటారా అని అడిగారు ఝాన్సీ . అయినా నాలుగు గోడల మధ్య మనల్ని మనం బందించుకొని హింస పడడం ఎందుకు అని బిగ్ బాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు.

 


End of Article

You may also like