Mahesh Babu: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !

Mahesh Babu: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !

by Sunku Sravan

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా తరువాత మరొకటి విడుదల అవ్వలేదు, ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అంతే కాదు మహేష్ బాబు కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తరువాత వంశి పైడిపల్లి తో ఒక గ్యాంగ్ స్టార్ సినిమా తీయబోతున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే కథ విషయం లో మహేష్ పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఆ సినిమా చేయట్లేదు అని వార్తలు వినిపించాయి.

Video Advertisement

sarkar-vaari-paata-look

sarkar-vaari-paata-look

అటు తరువాత ‘గీత గోవిందం’ సినిమా దర్శకుడు తెర మీదకి వచ్చారు. ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ తో ముందు వచ్చారు. ఈ సినిమా కి సంబంధించి ఒక లుక్ కూడా విడుదల చేసారు. ఫాన్స్ కి చాలా ఇంట్రెస్ర్టింగ్ గా కూడా అనిపించి. గత ఏడాదే ఈ సినిమా చిత్రికరణ పూర్తి అవ్వాలి కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసారు. ఇక చిత్ర యూనిట్ సింగల్ షెడ్యూల్ లో సినిమా ని పూర్తి చెయ్యాలని చూస్తున్నారు చిత్ర యూనిట్.

ALSO READ : తన కార్ ని తానే తగలపెట్టుకున్న ఓనర్… కారణం తెలిస్తే షాక్ అవుతారు.!

sarkar-vaari-paata-look

sarkar-vaari-paata-look

షూటింగ్ మొదట అమెరికా లో చిత్రికరించాలని అనుకున్న అది ఇప్పుడు కరోనా దృష్ట్యా వీలు పడదు. ఇక షూటింగ్ భాగం మొత్తం ఇండియాలోనే పూర్తి చేసే పనిలో పడ్డారు చిత్ర యూనిట్. తిరిగి షూట్ ప్రారంభించిన యూనిట్ కి మొదట్లోనే షాక్ తగిలింది సినిమా కి సంబంధించి ఒక వీడియో నెట్లో లీక్ కావడం హీరో లుక్, డైలాగ్స్ కూడా ఆ వీడియో లో ఉండటం హీరో మహేష్ కి కోపం తెప్పించిందట అంతే కాదు నిర్మాతకు మరో సారి ఇలా జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కొన్ని సార్లు ఇలా లీక్ అవుతూనే ఉంటాయి.

Also Read: “జడ్జ్” ని పూజించే గుడి గురించి విన్నారా..? ఆ గుడి ఎక్కడుంది అంటే.?


End of Article

You may also like