Ads
మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న “ఒక్కడు “చిత్రానికి ఉన్న ప్రత్యేకతే వేరు .ఎందుకంటే ఒక్కడు చిత్రంతోనే మహేష్ బాబు ఒక్కసారిగా మాస్ స్టార్ డామ్ అందుకున్నారు.గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.అయితే ఈ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా కనిపిస్తారు.
Video Advertisement
అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన మొబైల్ నెంబర్ 9848032919 అని మొదటగా నా భార్య కి కూడా చెయ్యకుండా నీకె చేస్తున్నాని అని చెప్తూ ఒక అమ్మాయితో మాట్లాడే సన్నివేశం నేటికీ హైలైట్ గా నిలుస్తుంది..ఇంతకీ ఆ మొబైల్ నెంబర్ ఎవరిదీ ? ఎందుకు ఈ నెంబర్ ఆ సన్నివేశం లో ఉపయోగించారు ? దాని వెనక ఆసక్తికర కథ ఉంది. అదేంటో చూడండి.
ఈ చిత్రంలో మహేష్ బాబు ,భూమిక ను రహస్యంగా అమెరికా కు పంపించాల్సి ఉంటుంది.దానికోసమే పాస్ పోర్ట్ అవసరం ఉంటుంది కనుక పాస్ పోర్ట్ ఆఫీసర్ ధర్మవరపు శ్రీనివాస్ ను మీట్ అవుతారు మహేష్ బాబు.అయితే ఆ సమయంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం తన నెంబర్ 9848032919 అని ఒక అమ్మాయితో చెప్పడం మహేష్ బాబు విని ఆ నెంబర్ కు రాంగ్ కాల్స్ చేసి విసిగిస్తాడు.దీంతో ధర్మవరపు సుబ్రమణ్యం ఫోన్ పగలకొట్టేస్తారు.ఈ నేపథ్యంలో కొరియర్ లో ఇవ్వవలసిన పాస్ పోర్ట్ డైరెక్ట్ గా ఇచ్చేస్తారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.
ఆ రోజుల్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పే ఆ ఫోన్ నెంబర్ బాగా పాపులర్ అయ్యింది.దీంతో చాలామంది ప్రేక్షకులు ప్రతి రోజూ ఆ మొబైల్ నెంబర్ కు లక్షల్లో ఫోన్ చేసేవారు.దీంతో ఆ వ్యక్తి తన మొబైల్ నెంబర్ మార్చేసుకున్నారు.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ చిత్ర నిర్మాత ఎం.ఎస్ రాజు గారు.అయితే “ఒక్కడు” షూటింగ్ సమయంలో ఒక ఫాన్సీ నెంబర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పాల్సి ఉండగా…..ఎవరి నెంబర్ చెబుదామా అని చిత్ర బృందం చర్చించుకుంటూ ఉంటే… ఎం.ఎస్ రాజు గారి నెంబర్ కంటే ఫాన్సీ నెంబర్ ఏముంటుంది అని చిత్ర బృందంలో ఓ వ్యక్తి అనడం వలన ఇలా జరిగిందంటా.
End of Article