Ads
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇవాళ మరొక అప్డేట్ విడుదల అయ్యింది.
Video Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి పాట విడుదల తేదీని సినిమా బృందం ప్రకటించింది. ఈ పాటని ఆగస్టు 1వ తేదీన 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ అప్డేట్ కి సంబంధించి విడుదల చేసిన ఫోటోలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో పాటు విజయ్ ఏసుదాస్, అనిరుధ్ రవిచందర్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది, అలాగే సింగర్స్ హేమచంద్ర, యాసిన్ నిజార్ ఉన్నారు. దోస్తీ అనే ఈ పాటని హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది విజయ్ ఏసుదాస్, యాసిన్ నిజార్ పాడారు. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ కనిపిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది.
End of Article