Narappa: ఆ 85 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సాధించలేనిది… నారప్ప సాధించింది.

Narappa: ఆ 85 కోట్ల భారీ బడ్జెట్ సినిమా సాధించలేనిది… నారప్ప సాధించింది.

by Sunku Sravan

Ads

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న -పెద్ద సినిమాలు అన్ని ఓటిటి లో విడుదల అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే . ప్రపంచ అగ్రగామి ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ పరిస్థితి ముఖ్యంగా ఇండియా లో కొంత దయనీయం గా  ఉంది అనే చెప్పాలి . ఇందులో రిలీస్ అయిన ఒక్క మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

Video Advertisement

narappa
వెంకటేష్ నటించిన నారప్ప మాత్రం భారీ వ్యూయర్ షిప్ తో టాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ సినిమా తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ కి రీమేక్ కాగా తెలుగులో వెంకటేష్ నటించారు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ 85 కోట్ల రేటుతో హిందీ లో క్రెజీ చిత్రం ఐన తుఫాన్ సినిమాని కొనుగోలు చేసింది. ఈ సినిమా పై అమెజాన్ ప్రైమ్ భారీ లాభాలు చేకూరతాయి అని అంచనాలు పెట్టుకోగా అది కాస్తా నిరుత్సాహపరిచింది. కానీ 40 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన నారప్ప మాత్రం భారీ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. నారప్ప సినిమా తో అమెజాన్ ప్రైమ్ లో టాలీవుడ్ కూడా ఫామ్ లోకి వచ్చినట్లు అయింది. జూన్ నెలలో రిలీజ్ అయిన నారప్ప మాత్రం అందరి అంచనాలను మించి టాప్ ప్లేస్ లో నిలిచింది.


End of Article

You may also like