Ads
కరోనా మొదలైనప్పటి నుండి అక్రమ సంబంధాల చిట్టా రోజుకు ఒకటి బయటకు వస్తుంది.తాజాగా
హర్యానా లోని గురుగ్రామ్ జిల్లాలో నాన్కువాన్ కు చెందిన రాజేష్ అని వ్యక్తికి పెళ్ళయ్యి ముగ్గురు పిల్లలున్నారు.అయినప్పటికీ అతడు అదే గ్రామానికి చెందిన ప్రియాంక అనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ప్రియాంకకు జూన్ 29న తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో వివాహం అయ్యింది.
Video Advertisement
తనకు పెళ్లి కావడంతో తమ అక్రమ సంబంధం కొనసాగించలేనని ప్రియాంక రాజేష్ కు చెప్పి అత్త వారింటికి వెళ్లిపోయింది.రాజేష్ తనతో అక్రమ సంబంధం కొనసాగించకుంటే ప్రియాంక పరువు తీస్తానని బెదిరిస్తూ ఉండేవాడు.అయినప్పటికీ ఆమె అతన్ని పట్టించుకోకపోవడంతో ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
ఆమె శనివారం పుట్టింటికి వచ్చిందన్న విషయం తెలుసుకొని తనతో మాట్లాడాలని తనని ఊరి చివరనున్న డాబా కు తీసుకెళ్ళి తనని తుపాకితో కాల్చి చంపి ఆతర్వాత తనని తాను కాల్చుకొని చనిపోయాడు. రాత్రి అవుతున్న ప్రియాంక తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఊరి చివరన ఉన్న డాబా దగ్గర పడివున్న మృతదేహాలను రాజేష్,ప్రియాంక లవి గా గుర్తించారు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర పోలీసులు ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు.
End of Article