అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. శ్రీమతి మమత సమర్పణలో గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల వైంకుంఠపురములో’ సినిమా విడుదల అయ్యింది . ఈ సినిమా కోసం ఇటు అల్లు అర్జున్, మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక ‘అల వైకుంఠపురములో’ ఎలా ఉంటుందో చూడాలని ఓ వర్గం ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.ఈ సంక్రాంతి రేసులో ఉన్న భారీ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఇప్పటికే విడులైన ‘దర్బార్’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు రోజు (జనవరి 12న) విడుదల అయ్యింది.. ‘అల వైకుంఠపురములో’ సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది.

Video Advertisement