తెలుగు చలన చిత్ర పరిశ్రమకు వై వి స్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు చిత్రంతో హీరో రామ్ తో పాటు పరిచయం అయింది ఈ అందాల ముద్దు గుమ్మా ఇలియానా డిక్రూజ్ . తర్వాత మహేష్ సరసన పోకిరి చిత్రం లో నటించింది . ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది . ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింగా వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులని అలరించాయి .తర్వాత బాలీవుడ్ లో అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీ చిత్రంతో హిందీ తెరకు పరిచయం అయ్యి ఫిలిం ఫేర్ అవార్డు కుడా అందుకొంది ఈ గోవా బ్యూటీ .తర్వాత కొన్ని చిత్రాలు నటించిన అవి అన్ని కుడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి . ఈ నేపథ్యంలో ఇలియానాకు అవకాశాలు లేక మెల్లగా ఫేడ్ అవుట్ అయింది ఈ ముద్దు గుమ్మా .అయితే సినిమాలలో నటించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టీవ్ గ ఉంటుంది ఈ బ్యూటీ.

Video Advertisement

ఎప్పుడు తన పర్సనల్ ఫోటోలు ,ట్రిప్ లకు సంబందించిన ఫోటోలను షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఓ విషాద సంఘటనను పోస్ట్ చేసింది .తన అంకుల్ మరణించిన కారణంగా తన బాధను వివరిస్తూ సుదర్గమైన పోస్టుతో అభిమానులతో షేర్ చేసుకొంది ఇలియానా .

నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు వీడియో లు ఆడియో నోట్లు ఉంటే బాగుండేది అనిపిస్తుంది .నా మనసు ఇప్పటికి నువ్వు లేవన్న విషయం నమ్మలేకపోతుంది . నాకు తెలిసినంత వరుకు నువ్వు ఒక గొప్ప ,అబ్దుతమైన వ్యక్తి వి .అయన లేరన్న విషయం మీతో పంచుకోవడం కుడా చాల బాధగా వుంది .నేను నిన్ను ఎంతో ఇష్టపడ్డాను నీతో మరింత సమయం గడిపి ఉంటే బాగుండేది .

స్వర్గం ఉందొ లేదో నాకు తెలియదు .ఒకవేళ స్వర్గం వుండి ఉంటే నువ్వు అక్కడే ఉంటావని ఆశిస్తున్నాను .నువ్వు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్న .ఇప్పటికి నేను కోరుకొనేది ఒక్కటే .రేపు ఉదయం నేను నిద్ర లేచే సమయానికి ఇదంతా ఒక పీడ కల అయితే బాగుండు .మల్లి నాతో ఒక్కసారి మాట్లాడితే బాగుండు .అంటూ తన ఆవేదననే, బాధను అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా….అయ్యో పాపం కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగానే ఉంటుంది కదా .బాధపడకు ఇలియానా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు .

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official) on