ఇండియ‌న్ ప్లేయ‌ర్ మ‌నీష్ పాండే త‌న ఫీల్డింగ్ స్కిల్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అద్భుత‌మైన క్యాచ్‌తో రాజ్‌కోట్‌లో ఆసీస్ ఓపెన‌ర్ వార్న‌ర్‌కు షాక్ ఇచ్చాడు. ష‌మీ వేసిన బౌలింగ్‌లో క‌వ‌ర్స్ మీదుగా భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించిన వార్న‌ర్‌.. మ‌నీష్ అందుకున్న అద్భుత‌మైన క్యాచ్‌తో వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. గాలిలో వేగంగా వెళ్తున్న బంతిని.. మ‌నీష్ గాలిలోకి ఎగిరి ఒంటి చేతితో దాన్ని అందుకున్నాడు. ఫ్లాష్ వేగంగా మ‌నీష్ ఆ క్యాచ్‌ను అందుకుని కేక పుట్టించాడు. వార్న‌ర్ 12 బంతుల్లో రెండు ఫోర్ల‌తో 15 ర‌న్స్ చేశాడు. 341 ర‌న్స్ చేజ్ చేస్తున్న‌ ఆస్ట్రేలియా.. 16 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి 86 ర‌న్స్ చేసింది.

Video Advertisement