సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో …ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చెప్పాలి. ఈ సినిమాని తన భుజం మీద మోసుకొచ్చాడు థమన్. విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు. అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.ఈ సినిమాలో నవదీప్ ఓ పాత్రలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ భార్య నవదీప్ కి ఫ్యాన్ అంట. బిగ్ బాస్ 1 సీజన్లో నవదీప్ ప్రవర్తించిన తీరుని చూసి తన భార్య కొడుకు నవదీప్ కి అభిమానులు అయ్యారు అని చెప్పారు త్రివిక్రమ్. సినిమాలో అందరిగురించి మాట్లాడారు కానీ నవదీప్ గురించి ఫస్ట్ మరిచిపోయారు. ఈ క్రమంలో నవదీప్ గురించి మాట్లాడకపోతే నా భార్య నన్ను తిడుతుంది అని అసలు విషయం చెప్పి అందరిని నవ్వించారు త్రివిక్రమ్. కేవలం నవదీప్ ని చూడటం కోసం నా భార్య పారిస్ షూట్ కి వచ్చింది అని నవ్వుతు చెప్పారు త్రివిక్రమ్.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com