కేజీఎఫ్ 2 టీజర్ : హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీల‌క విల‌న్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజ‌య్‌ద‌త్  క‌నిపించ‌బోతున్నారు.

Video Advertisement

”రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్” పేరుతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం ఆర్‌ఎఫ్‌సీలో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి 8న ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ప్ర‌త్యేకంగా టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ రోజు హీరో య‌ష్ పుట్టిన రోజు కావ‌డ‌మేనని తెలిసింది.