సాధారణంగా కొంత మంది ఎత్తైన భవనంపైకి ఎక్కి కిందకు చూడాలంటేనే భయపడుతారు. కానీ స్పెయిన్‌కు చెందిన ఓ చిన్న పాప మాత్రం నాలుగు అంతస్తులపైన చిన్న అంచుపై పరుగులు తీసింది. ప్రస్తుతం ఆ పాపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ఐదు లేదా ఆరు సంవత్సరాల పాప ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న గది కిటికీ నుంచి బయటికి వచ్చి.. కిటికీ బయట ఉండే చిన్న అంచుపై పరుగులు తీస్తూ ఆ గది బాల్కనీలోకి వెళ్లడానికి ప్రయత్నం చేసింది. బాల్కనీలోకి దిగేందుకు ప్రయత్నించి విఫలమైన ఆ చిన్నారి.. తిరిగి అదే అంచుపై పరుగులు తీస్తూ కిటికీ వైపు వెళ్లింది. ఇదంతా దూరం నుంచి గమనించిన కొందరు.. నాలుగు అంతస్తులపైన ఓ అంచుపై పరుగులు తీస్తున్న ఆ చిన్నారి దృశ్యాలను సెల్‌ఫోన్‌లలో బంధించారు. అంతేకాకుండా పాప ప్రాణాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Video Advertisement