ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఓ పోలీస్‌ రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ కిందకు దిగి పాల ప్యాకెట్ల ట్రే వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి తనకు కావాలసిన బ్రాండ్ కోసం వెదికాడు. అక్కడ ఉనన మూడు ట్రేలలో రెండు ప్యాకెట్లను సెలక్ట్ చేసుకున్నాడు. అవి తీసుకుని తెలివిగా జీపులో కూర్చొన్న మరో కానిస్టేబుల్‌కు అందించాడు.  పాల డెయిరీకి చెందిన ఒక దుకాణంలో ప్రతీ రోజూ పాల ప్యాకెట్లు లెక్కించినప్పుడు తక్కువ ఉంటున్నాయి. దీంతో దొంగతనం జరుగుతున్నదని అనుమానం వచ్చిన ఆ దుకాణం యజమాని…తన షాపు ముందు సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. అతను సీసీటీవీని పరిశీలించగా ఒక పోలీసు పాల ప్యాకెట్ల చోరీకి పాల్పడుతున్నాడని తేలింది. దీంతో ఈ సమాచారాన్ని అతను పోలీసు అధికారులకు తెలియజేశాడు. పోలీసుకానిస్టేబుల్ పాలప్యాకెట్లను దొంగతనం చేస్తున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

Video Advertisement