14 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి మూడు నెలల పని అనేసరికి వారంతా ఎగిరి గంతేశారు. చేతిలో ఉన్న సార్వా కూలి పనులనూ పక్కనబెట్టి, మొక్కలు నాటడానికి సిద్ధమయిపోయారు. మూడు రోజులు పనిచేసి కూలి అడిగితే, వారిని ఆ పనికి పెట్టుకొన్న వ్యక్తి వెర్రిచూపులు చూశాడు. అతడి తీరును చూసి తెల్లబోవడం కూలీల వంతు అయింది. అలాంటి పనులేవీ తాము చేయించడం లేదని అధికారులు తేల్చేయడంతో, పోయి.. పోయి.. చివరికి పిచ్చోడి చేతిలో మోసపోయామని తమను తాము తిట్టుకొంటూ కూలీలు అక్కడినుంచి కదిలారు.

Video Advertisement