యష్ బర్త్‌డే గిఫ్ట్.. అదరగొడుతున్న కేజీఎఫ్‌ 2 డైలాగ్స్… రెండు డైలాగ్స్ కుమ్మేసాడు

యష్ బర్త్‌డే గిఫ్ట్.. అదరగొడుతున్న కేజీఎఫ్‌ 2 డైలాగ్స్… రెండు డైలాగ్స్ కుమ్మేసాడు

by Megha Varna

Ads

హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీల‌క విల‌న్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజ‌య్‌ద‌త్  క‌నిపించ‌బోతున్నారు. రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్” పేరుతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌తో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా యష్‌ పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్‌ 2 సెకండ్‌ లుక్‌ రిలీజ్‌ అయ్యింది. 90ల నాటి స్టైలింగ్‌లో చేతిలో ఆయుదంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్న యష్‌ లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. కొంత భాగం షూటింగ్‌ కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 తెరకెక్కిస్తున్న సమయంలో పూర్తి చేశారు. యష్ బర్త్ డే సెలబ్రేషన్ లో KGF2 డైలాగ్స్ చెప్పేసాడు…. మీరు కూడా వినండి

Video Advertisement

KGF 2 Dialogue 1 : ఒక అడుగు వేసి వచ్చాడు అన్నారు….గడియారం లో ఒక గంట అవ్వాలి అంటే పెద్ద ముళ్ళు 60 అడుగులు వేయాలి…అదే చిన్న ముళ్ళు ఒక్క అడుగు వేసి వస్తే చాలు..

KGF2 Dialogue 2: నేను అడుగు పెట్టేసాను ఆట రేంజ్ చేంజ్ అయ్యింది…ఇంకా నుంచి పాము నిచ్చెన ఆట లో ముంగీస దిగింది .. భూభాగం నీది నాది అని లేదు.THE WORLD IS MY TERRITORY


End of Article

You may also like