సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వాల్మీకి పాత్రలో నటించి మెప్పించిన మురళి శర్మ గారి గురించి. ఆయన క్యారెక్టర్లో చూపిన వేరియేషన్స్ తో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

Video Advertisement

తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మురళి శర్మ గారు ఆడియో ఈవెంట్ కి కానీ సక్సెస్ ఈవెంట్ కి కానీ హాజరు కాలేదు. దీనితో అభిమానుల్లో కొన్ని అనుమానాలు నెలకొన్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే…ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసిన కథనం ప్రకారం మురళీశర్మకు సరైన రెమ్యూనరేషన్ లభించలేదని, 50 రోజుల డేట్స్ కి ఒప్పుకున్న తర్వాత 80 రోజులపాటు షూటింగ్ చేయించుకున్నారని తెలిపారు. అంతేకాని 80 రోజుల రెమ్యూనరేషన్ ఇవ్వకుండా 50 రోజుల పేమెంట్ మాత్రమే ఇవ్వడంతో మురళి శర్మ చిత్ర బృందంపై అలిగారని పేర్కొన్నారు. కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న చిత్రం…ఇలా ఓ నటుడికి పేమెంట్ ఇవ్వకపోవడం ఏంటి అంటూ చర్చ జరుగుతుంది.