Ads
క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు బ్యాట్సమెన్ పరుగులు(సున్నా పరుగులు) చేయకుండా ఔట్ అయ్యాడు ….అప్పుడు అందరూ డక్ పెట్టినారు అని అంటూ ఉంటారు…..సున్నా పరుగులకు ఔట్ అయితే డక్ అంటున్నారు అని అందరి సందేహం….అలా అనడానికి కారణం అసలు కారణం ఇదే.ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ సున్న ( సున్నా పరుగులు ) కే ఔట్ అయ్యాడు అప్పుడు ఓ పత్రిక ఈ వార్తను ప్రచురిస్తూ…వేల్స్ చేసిన 0 పరుగులను బాతు గుడ్డుతో పోల్చుతూ వార్త రాసింది. ఎందుకంటే బాతుగుడ్డు 0 లాగా గుండ్రంగా ఉటుంది.! అక్కడి నుండి 0 ను డక్ ఔట్ అనడం ప్రారంభమైంది. వార్తా పత్రికలో అది రావడంతో అందరూ చదవడంతో అప్పటి నుంచి అది త్వరగా వ్యాప్తిలో వచ్చింది.డక్ అవుట్ లో కూడా చాలా రకాలు ఉంటాయి .
Video Advertisement
duck out meaning in telugu
బ్యాట్సమెన్ తాను ఆడిన మొదటి బంతికే అవుట్ అయితే దాన్ని గోల్డెన్ డక్ అంటారు.అలాగే పరుగులు ఏమీ చేయకుండానే రెండు, మూడు బాల్స్‌కు అవుట్ అయితే వాటిని సిల్వర్, బ్రాంజ్ డక్స్ అని పిలుస్తారు.ఇక మ్యాచ్‌లో బాల్స్‌ను ఆడకుండా, పరుగులు చేయకుండా ఔట్ (రన్ అవుట్) అయితే దాన్ని డైమండ్ డక్ అని పిలుస్తారు.అలాగే బ్యాట్స్‌మెన్ తాను మ్యాచ్‌లో ఆడే మొదటి బాల్ లేదా, ఆ సీజన్‌కు ఆ బ్యాట్స్‌మెన్ టీం ఆడే మొదటి మ్యాచ్ మొదటి బాల్‌కు బ్యాట్స్‌మెన్ అవుట్ అయితే దాన్ని పల్లాడియం డక్ అంటారు
End of Article