Ads
2019 లో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా కేజిఎఫ్. కన్నడలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలయ్యి కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా రికార్డు స్థాయిలో విజయం సాధించింది. రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేజిఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Video Advertisement
ఈ సినిమాకి సంబంధించి యష్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించడం మాత్రమే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఇంకా రెట్టింపు అయ్యేలా చేసింది. అయితే, కేజిఎఫ్ 2 జూలై 16 వ తేదీన విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతున్నందుకు యష్ అభిమానులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేజిఎఫ్ 2 విడుదలయ్యే రోజుని నేషనల్ హాలిడే గా ప్రకటించాలని కోరుతూ ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
End of Article