Home News మెట్రో స్టేషన్ దగ్గర యువతి ఆత్మహత్యాయత్నం.. వైరల్ అవుతున్న వీడియో.!

మెట్రో స్టేషన్ దగ్గర యువతి ఆత్మహత్యాయత్నం.. వైరల్ అవుతున్న వీడియో.!

by Mohana Priya

మానసిక ఒత్తిడి కారణంగా ఒక యువతి మెట్రో స్టేషన్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన ఆ యువతి ఫరీదాబాద్ సెక్టార్-28 లోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తోంది. పని ఒత్తిడి వల్ల తను మానసిక ఆందోళనకు గురి అయింది. అందుకే ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఫరీదాబాద్ మెట్రో స్టేషన్ లోని బాల్కనీలోని రైలింగ్ మీదకు ఎక్కి అంచు మీద నుంచి దూకేందుకు ప్రయత్నించింది.

అక్కడ విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ ధన్ ప్రకాష్, కానిస్టేబుల్ సర్ఫరాజ్ ఈ సమాచారం తెలియగానే మెట్రో స్టేషన్ కి చేరుకున్నారు. ఆ యువతి దగ్గరికి వెళ్లి ధన్ ప్రకాష్ మాటల్లో పెట్టి దృష్టి మరల్చడానికి ప్రయత్నించారు. వెంటనే సర్ఫరాజ్ మరో వైపు నుంచి ఆ యువతి దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకుని కిందకి దూకకుండా ఆపారు. ఆ మెట్రో స్టేషన్ కింద నుండి వెళుతున్న వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. జనాలు ఈ సంఘటనని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

watch video :

You may also like