Ads
మనిషి అన్న తర్వాత పొరపాట్లు చేయడం అనేది సహజం. ఏదైనా నేర్చుకోవాలి అంటే అందులో కచ్చితంగా తెలిసీ తెలియకుండా ఒక పొరపాటు అవుతుంది. కానీ ఒక మనిషి తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లు మాత్రం పరిస్థితులను మార్చేస్తాయి. ఆ పొరపాటు వల్ల భవిష్యత్తు మారిపోతుంది. అలా కొంతమంది చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఒకవేళ ఆ పొరపాటు చేయకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
#1 2002లో యాహూ గూగుల్ ని కొనడానికి రిజెక్ట్ చేయడం. ముందు గూగుల్ అధినేతలు తమ అల్గోరిథం ని యాహూ కి ఒక మిలియన్ కి అమ్మే ఆఫర్ ఇచ్చారట. కానీ యాహూ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు గూగుల్ అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమైపోయిందో అందరికీ తెలుసు. ఒకవేళ యాహూ గూగుల్ ని కొనుక్కొని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది ఏమో. యాహూ ఇప్పుడు కూడా వెలుగులోనే ఉండేదేమో.
#2 రెండవది స్పేస్ షటిల్ కొలంబియా యాక్సిడెంట్. కొంతమంది ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజులు స్పేస్ లో ఉండి ఎక్స్పరిమెంట్ చేసి తిరిగి వస్తున్నప్పుడు స్పేస్ షటిల్ కొలంబియా గాలిలోనే పేలిపోయింది. ఆ ప్రమాదంలో ఆస్ట్రోనాట్స్ మరణించారు. దానికి కారణం స్పేస్ షటిల్ లాంచ్ అయినప్పుడు ఫోమ్ ఇన్సులేషన్ స్పేస్ షటిల్ వింగ్ కి తగిలిందట. వెళ్ళేటప్పుడు ఏమీ అవ్వలేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల డామేజ్ అయిన వింగ్ లో నుంచి గాలి లోపలికి వెళ్ళి స్పేస్ షటిల్ ఎక్స్ప్లోడ్ అయింది.
#3 2010 లో ఒకావిడ లాటరీ టికెట్ కొనుక్కున్నారట. ఆ లాటరీ టికెట్ నెంబర్ ని నోట్ పాడ్ లో సేవ్ చేసుకునే టికెట్ ని జాగ్రత్తగా పెట్టమని తన భర్తకి ఇచ్చారట. తర్వాత లాటరీ రిజల్ట్ ఎనౌన్స్ చేసినప్పుడు విజేత పేరు తన పేరే ఉందట. తన భర్త దగ్గరికి వెళ్లి టికెట్ ఇవ్వమని అడిగారట ఆవిడ. కానీ తన భర్త టికెట్ ని ఎక్కడో పడేశారట. దాంతో ఆవిడకి దాదాపు వెయ్యి కోట్ల విలువైన లాటరీ మిస్ అయిందట.
#4 జపాన్ కి చెందిన జే కాం అనే కంపెనీ షేర్స్ అమ్మకానికి పెట్టాలి అనుకొని ఒక్కొక్క షేర్ ని 6,10,000 యెన్ కి అమ్మాలి అనుకుంది. ఈ పనిని మిజుహో సెక్యూరిటీస్ అనే కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ ఒక్కొక్క షేర్ ని 6,10,000 యెన్ కి బిడ్ చేయబోయి, 6,10,000 షేర్స్ ని ఒక్కొక్క షేర్ ని ఒక యెన్ కి బిడ్ చేసింది. దాంతో జే కాం కంపెనీకి దాదాపు 15 వందల కోట్ల వరకు నష్టం వచ్చిందట. అప్పుడు మిజుహో వాళ్ళు జే కాం కంపెనీకి దాదాపు 1500 కోట్ల నష్టపరిహారం చెల్లించారట.
#5 1994 లో కొరియాలో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జి మీద 36 టన్నులు లోడ్ ఉన్న వాహనాలు మాత్రమే వెళ్లే లాగా బ్రిడ్జి ని రూపొందించారు. కానీ ఒక రోజు 48 టన్నులు ఉన్న వాహనాలు బ్రిడ్జి మీద నుంచి వెళ్లడంతో బ్రిడ్జ్ మధ్యభాగం కూలిపోయింది. ఇందులో 32 మంది మరణించారు.
#6 ఒక వ్యక్తి ఆరు వేల రూపాయల విలువైన 7500 బిట్ కాయిన్స్ ని తన లాప్ టాప్ లో మైనింగ్ చేశారట. ఆ తర్వాత మైనింగ్ ఆపేసి లాప్ టాప్ ని డిస్ అసెంబుల్ చేసి బిట్ కాయిన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ తన దగ్గరే ఉంచుకున్నారట. కానీ తర్వాత ఆ హార్డ్ డ్రైవ్ ని డస్ట్ బిన్ లో పడేసారట. 2017 లో బిట్ కాయిన్స్ రేటు పెరిగింది. కానీ అతను డస్ట్ బిన్ లో పడేసిన హార్డ్ డ్రైవ్ మాత్రం పోయింది. ఒకవేళ హార్డ్ డ్రైవ్ కోసం వెతికినా కూడా దొరికేది కాదు. ఎందుకంటే అతను హార్డ్ డ్రైవ్ పడేసింది 2009లో కాబట్టి.
#7 17వ శతాబ్దంలో అలాస్కా ని రష్యా డిస్కవర్ చేసింది. దాంతో తర్వాత 120 సంవత్సరాల కు పైగా అలాస్కా రష్యా దేశానికి చెందింది. 1867 లో రష్యా అలాస్కా ని 50 కోట్ల రూపాయలకు అమెరికాకి అమ్మింది. తర్వాత అలాస్కా లో కొన్ని లక్షల కోట్ల విలువ ఉన్న ఆయిల్ రిజర్వ్స్ , గోల్డ్ రిజర్వ్స్ బయటపడ్డాయి.
#8 నాసా వాళ్ళు పంపిన ఒక సాటిలైట్ పది నెలల తర్వాత మార్స్ దగ్గర కనిపించింది. మార్స్ ప్లానెట్ కి ఆ సాటిలైట్ 227 కిలోమీటర్ల దూరంలో ఉంది. సైంటిస్టులు ఆ సాటిలైట్ ని 110 కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఆర్బిట్ లో ఉంచితే కరెక్ట్ గా ఉంటుంది అనుకున్నారు. అలా పంపించడానికి శాటిలైట్ కి కొంచెం ఫోర్స్ అవసరం. ఆ ఫోర్స్ ఎంతో కాలిక్యులేట్ చేసే పనిని నాసా ఒక కంపెనీకి అప్పగించింది. నాసా వాళ్ళు ఫోర్స్ మీ న్యూటన్స్ యూనిట్ లో తీసుకుంటారు. కానీ ఆ కంపెనీ వాళ్లు పౌండ్స్ లో కాలిక్యులేట్ చేశారట. దాంతో ఆ సాటిలైట్ ఆర్బిట్ మీదకి వెళ్లకుండా మార్స్ మీదకి క్రాష్ ల్యాండ్ అయింది. దాంతో నాసా వాళ్లకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందట.
#9 ఆపిల్ సంస్థకి మొదటి కాంట్రాక్టు గా ఒక కంపెనీకి కంప్యూటర్స్ సప్లై చేయాలి. అయితే ఆ కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వరు అనే మాట విన్న ఆపిల్ సంస్థలో ఒక పార్ట్నర్ రోనాల్డ్ వేన్ దీనికి ఒప్పుకోలేదు. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం ఈ కాంట్రాక్ట్ కి అంగీకరించారు. దాంతో రోనాల్డ్ వేన్ తన 10% షేర్లని 50 వేలకి స్టీవ్ జాబ్స్ కి అమ్మేసి ఆపిల్ కంపెనీ నుండి బయటికి వచ్చేశారు. కానీ తర్వాత ఆ 10% షేర్లు ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యాల్యూ అయ్యాయి.
#10 టైటానిక్ షిప్ క్రూ లో ఒకతన్ని తొలగించి చివరి నిమిషంలో ఇంకొక అతన్ని రీప్లేస్ చేశారు. అయితే ముందు ఉన్న అతను బైనాక్యులర్స్ ఉన్న రూమ్ కీస్ ని రీప్లేస్ అయిన అతనికి ఇవ్వడం మర్చిపోయారట. దాంతో బైనాక్యులర్స్ లేకపోవడంతో ఐ సైట్ మీద ఆధారపడి టైటానిక్ ని నడిపారట. దూరంలో ఉన్న ఐస్ బర్గ్ కనిపించకపోవడంతో షిప్ ఢీకొని ప్రమాదానికి గురైంది.
End of Article