Home Filmy Adda ఈ 10 సినిమాల్లో మొదటగా మనం ఒకరిని విలన్ అనుకుంటాము…కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్.?

ఈ 10 సినిమాల్లో మొదటగా మనం ఒకరిని విలన్ అనుకుంటాము…కానీ క్లైమాక్స్ లో ట్విస్ట్.?

by Mohana Priya

సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు ఇంకొక ముఖ్యమైన పాత్ర విలన్. చాలా సినిమాల్లో మనకి ఒకరిని విలన్ గా చూపిస్తారు కానీ తర్వాత వారు విలన్ కాదు, ఇంకొకరు విలన్ అని తెలుస్తుంది.

ఈ టెక్నిక్ ని రెడ్ హెర్రింగ్ టెక్నిక్ అంటారు. అయితే ఇలా సినిమాల్లో మనకి ముందు వరకు ఒకరిని విలన్ గా చూపించి తర్వాత ఇంకొకరు విలన్ అయిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 గూడచారి

ఈ సినిమాలో ముందువరకు సుప్రియ విలన్ అని అనుకుంటాం తర్వాత జగపతి బాబు విలన్ అని తెలుస్తుంది. అలాగే వెన్నెల కిషోర్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ విషయాన్ని మనకి చివరి వరకు చూపించరు.

Movies with unexpected villains

#2 రంగస్థలం

ఈ సినిమాలో మన ముందువరకు జగపతి బాబు విలన్ అనుకుంటాం. కానీ చివరికి ప్రకాష్ రాజ్ విలన్ అని తెలుస్తుంది.

Movies with unexpected villains

#3 డిస్కో రాజా

ఈ సినిమాలో మనం ముందు వరకు బాబీ సింహా విలన్ అనుకుంటాం. కానీ చివరిలో సునీల్ విలన్ అని తెలుస్తుంది.

Movies with unexpected villains

#4 పెంగ్విన్

పెంగ్విన్ సినిమాలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ విలన్ అని చివరికి తెలుస్తుంది.

Movies with unexpected villains

#5 హిట్

హిట్ సినిమాలో ముందు వరకు హరితేజ విలన్ అనుకుంటాం. కానీ చివరిలో హీరో ఫ్రెండ్, కొలీగ్ రోహిత్ తన భార్య కోసం ఇదంతా చేశాడు అని తెలుస్తుంది.

Movies with unexpected villains

#6 వన్ నేనొక్కడినే

ఈ సినిమా చూసిన వాళ్లు అందరం ప్రదీప్ రావత్ మెయిన్ విలన్ అనుకుంటాం. కానీ చివరిలో నాజర్ విలన్ అని తెలుస్తుంది.

Movies with unexpected villains

#7 ఎవరు

ఈ సినిమాలో మనం నవీన్ చంద్ర విలన్ అనుకుంటాం. కానీ రెజీనా కసాండ్రా విలన్ అని చివరికి తెలుస్తుంది.

Movies with unexpected villains

#8 అతడు

ఈ సినిమాలో కూడా మనం మెయిన్ విలన్ కోట శ్రీనివాసరావు గారు అని అనుకుంటాం. కానీ ఆయనతో పాటు సోనూ సూద్ కలిసి అదంతా చేశారు అని చివరి వరకు మనకి తెలియదు.

Movies with unexpected villains

#9 రంగం

ఈ సినిమాలో మనం ప్రకాష్ రాజ్ విలన్ అనుకుంటాం. మధ్యలో కోట శ్రీనివాస్ రావు గారి పాత్ర మీద కూడా అనుమానం వస్తుంది. కానీ చివరికి అజ్మల్ అమీర్ అని తెలుస్తుంది.

Movies with unexpected villains

#10 రాక్షసుడు

ఈ సినిమాలో కూడా హీరో పై అధికారి విలన్ అనుకుంటాం. కానీ చివరికి క్రిస్టోఫర్ విలన్ అని తెలుస్తుంది.

Movies with unexpected villains

You may also like