100 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆ హీరో భార్య పిల్లలు..! అసలేమైంది?

100 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆ హీరో భార్య పిల్లలు..! అసలేమైంది?

by Megha Varna

Ads

లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వలస కార్మికులతో పాటు ఇతరులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయితే విమాన సర్వీస్ లు కూడా రద్దు చెయ్యడంతో విదేశాలలో చిక్కుకుపోయి స్వదేశానికి రావడానికి వీలు లేకుండా బాధపడుతున్నవారు ఎందరో.అయితే దాదాపు 3 నెలల విదేశాలలో చిక్కుకుపోయిన టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్య మరియు ఆయన పిల్లలు తిరిగి భారతదేశానికి వస్తున్నారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..

Video Advertisement

కరోనా వైరస్ కారణంగా అన్ని రవాణా మార్గాలను నిలిపివేసిన విషయం తెలిసిందే.దీంతో విమాన మార్గాలన్నీ కూడా స్తంభించాయి.అయితే ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నియమాలను సడలింపులు చెయ్యడంతో కొన్ని విమాన సర్వీసులు పనిచేస్తున్నాయి.అయితే విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి “వందే భారత్ మిషన్ ” ద్వారాభారత ప్రభుత్వం తీసుకువస్తుంది .అయితే దాదాపు 100 రోజుల పాటు ఇతర దేశంలో చిక్కుకుపోయిన హీరో మంచు విష్ణు భార్య విరానికా మరియు ఆయన పిల్లలను వందే భారత్ మిషన్ ద్వారా భారతదేశానికి తీసుకువస్తున్నారు.

కాగా ఈ విషయాన్నీ విరానికా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.మేము భారత్ కు తిరిగిరావడానికి సహకరించిన వందే భారత్ మిషన్ ,ఎయిర్ ఇండియా ,సింగపూర్ బృందానికి కృతఙ్ఞతలు అని ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.అయితే దీనిపై హీరో మంచు మనోజ్ స్పందిస్తూ …వెల్కమ్ వదిన .నిన్ను చూడడానికి చాలా రోజులు నుండి ఎదురుచూస్తున్నా అని రిప్లై ఇచ్చారు.

 

 


End of Article

You may also like