Ads
ప్రపంచదేశాలు మన దేశ సంప్రదాయాలను,వాటి విశిష్టతను ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి.అందుకే మన చరిత్రలో ముఖ్యమైన యోగాను జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచం గుర్తించింది.తాజాగా ఈ యోగ పై విదేశాలలో ఒక రికార్డ్ నమోదైంది.
Video Advertisement
అదేంటో ఇప్పుడు చూద్దాం.ప్రపంచంలో అతి ఎతైన బుర్జ్ ఖలీఫాలోని అతి చిన్న ప్రదేశంలో భారతీయ సంతతికి చెందిన 11 ఏళ్ల సమృద్ది కాలియా 3 నిమిషాల 18 సెకండ్ ల వ్యవధిలో ఏకంగా 100 వేర్వేరు యోగా ఆసనాలను వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.ప్రపంచ రికార్డ్ లో ఇది ఆమెకు మూడవది. ఈ మూడవ ప్రపంచ రికార్డ్ ఫీట్ ను గత గురువారం తన పేరు పై నమోదు చేసుకుంది.
గత నెల జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న పెట్టె లోపల దాదాపు 1 నిమిషంలో 40 అధునాతన యోగా ఆసనాలను ప్రదర్శించి రెండో ప్రపంచ రికార్డ్ ను సమృద్ది గెలుచుకుంది.భారత ప్రభుత్వం యోగా రంగంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు సమృద్దికి 2020 జనవరిలో ప్రవాసి భారతీయ దివాస్ అవార్డును ఇచ్చి సత్కరించింది.సమృద్ది తండ్రి సిద్ధార్థ్ కాలియా మాట్లాడుతూ తన కూతురుఆరు సంవత్సరాల వయస్సు నుండే యోగా నేర్చుకుంటుందని చెప్పారు.
End of Article