పేదల ఆకలి తీర్చడానికి ఆ 11 అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ప్రాజెక్ట్ “కేర్-వన్”!

పేదల ఆకలి తీర్చడానికి ఆ 11 అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ప్రాజెక్ట్ “కేర్-వన్”!

by Megha Varna

“ప్రార్దించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రస్తుతం అదే పని చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటుంది హైదరాబాద్ కి చెందిని పదకొండేళ్ల రిధి వంగపల్లి .లాక్ డౌన్ నేపధ్యంలో తిండిలేక ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు అందించడానికి తన పాకెట్ మనీ ఖర్చు పెట్టడమే కాదు, ఏకంగా తొమ్మిది లక్షల వరకు కలెక్ట్ చేసి బీదల ఆకలి తీరుస్తున్నది.

Video Advertisement

హైదరాబాద్ కి చెందిన రిధి వంగపల్లి, ఆరవ తరగతి చదువుతంది. ఇటీవల ఆకలితో బాధ పడుతున్న ఒక వ్యక్తి వీడియో చూసిన రిధి, ఎలా అయినా పేదల ఆకలి తీర్చాలనుకుంది. అందులో భాగంగా తన పాకెట్ మనీతో ఒక కుటుంబానికి సరిపడా 5 కెజిల బియ్యం, ఉప్పు, పప్పు, కారం ,నూనె, సబ్బులు ఇలా కొన్ని సరుకులను వారికి అందచేసింది. అప్పుడే రిధి ఆలోచనలో పడింది. ఆకలితో బాధపడేవారెందరో ఉన్నారు..వారిలో కొంతమంది బాధనైనా తీర్చాలని అనుకుంది.

 

ఆలోచన వచ్చిందే ఆలస్యం తన ఫ్యామిలి మెంబర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసింది. మొత్తం లక్షా ముప్పైవేలు పోగయ్యాయి. నలుగురు ఉన్న కుటుంబానికి కావలసిన సరుకుల లిస్టు తనే తయారుచేసింది.  ఆ లిస్టు ప్రకారమే తను కిట్ తయారు చేసింది. వాటితో  తను తయారు చేసుకున్న కిట్ (నిత్యావసర సరుకులు)కొని  రెండువందల కుటుంబాలకు నిత్యావసరాల కిట్స్ ని అందించింది.

తర్వాత “కేర్-వన్” అని ప్రారంభించి దాని ద్వారా స్నేహితులు, వారి కుటుంబాలు, తెలిసిన వారి దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసింది. మొత్తం తొమ్మిది లక్షల వరకు పోగయ్యాయి. వాటిని తను తయారు చేసిన లిస్టులో సరుకులు కొని కిట్స్ తయారు చేసింది. ఇప్పటివరకు రెండు వందల కుటుంబాలకు కిట్స్ అందించిన రిధి, మరో వెయ్యిమందికి కిట్స్ అందించడానికి సిద్దంగా ఉంది.  ఒక చిన్న ఆలోచన రిధిని ఇంత పెద్ద సాయం చేసేలా చేసింది.. రిధి చేస్తున్న పనిని చుట్టుపక్కల వారితో పాటు, నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.


You may also like