లాక్ డౌన్ వేళ 11 ఏళ్ల బాలుడి కష్టం…సైకిల్ రిక్షాపై తల్లితండ్రులను 500 కి.మీ లు!!

లాక్ డౌన్ వేళ 11 ఏళ్ల బాలుడి కష్టం…సైకిల్ రిక్షాపై తల్లితండ్రులను 500 కి.మీ లు!!

by Megha Varna

Ads

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్న విషయం తెలిసిందే.రవాణా మార్గాలన్నీ కూడా నిలిపివేయడంతో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయారు.సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరుకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.కాగా అందరూ కూడా సామాజిక దూరం పాటించాలని సోషల్ మీడియాలో లో సెలబ్రెటీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.దీంతో ఇప్పటికే వలస కూలీలు ఎక్కడివారు అక్కడ నిలిచిపోయారు.తమ సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు.

Video Advertisement

పొట్ట కూటికోసం ఇతర రాష్ట్రాల నుండి తరలి వచ్చి కూలి పనులు చేసుకొనే వారు మన దేశంలో చాలామందే ఉన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో వలసకూలీలు తమ ప్రాంతాలకు చేరుకునేందుకు కాలి నడకన సైకిల్ మరియు రిక్షాలను ఉపయోగించుకుంటున్నారు.ఇలా ప్రయాణిస్తూ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వారు చాలామందే ఉన్నారు .ఇలాంటి కంట తడి పెట్టించే ఘటనలు లాక్ డౌన్ లో చాలానే చూసాం.కాగా కొంతమంది సెలెబ్రెటీలు కూడా వలస కూలీలు తమ ప్రాంతాలకు చేరుకునేందుకు సహాయం చేసారు.ఈ నేపథ్యంలో తల్లితండ్రులను తమ ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి 11 యేళ్ళ బాలుడు ఏంచేసాడో తెలిస్తే కళ్ళు చమర్చాక తప్పదు .. వివరాల్లోకి వెళ్తే ..

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుండి బీహార్ లోని అరారియాకు 500 కిలోమీటర్ల దూరం తన తల్లితండ్రులను రిక్షాలో కూర్చోపెట్టుకొని 11 యేళ్ళ తాబేర్ ఆలమ్ తమ సొంత ప్రాంతానికి చేర్చాడు ..తబరే తండ్రి రిక్షా కార్మికుడు లాక్ డౌన్ కారణంగా తినడానికి తిండి కూడా లేని పరిస్థితులలో చనిపోతే సొంత ప్రాంతంలోనే చనిపోదాం అని సొంత ఊరుకి బయలు దేరారు. తాబేర్ తండ్రి 55 యేళ్ళకు పైబడిన వ్య్తకి కావున అంత దూరం రిక్షా తొక్కలేడని తబరే ఆ భారాన్ని తన భుజం మీద వేసుకున్నాడు …మధ్య మార్గంలో తబరేను చూసినవాళ్లు కొంతమంది ఆర్ధిక సాయం కూడా చేసారు..గుడ్డివాళ్ళయినా తల్లితండ్రులను కావిడితో మోసిన శ్రవణుడిలానే తబరే కూడా తన తల్లితండ్రులను రిక్షాలో తీసుకువెళ్లాడని అందురూ కూడా తబారెను అభినవ శ్రవణుడిగా అభివర్ణిస్తున్నారు.

 


End of Article

You may also like