13 ఏళ్ల అమ్మాయి సంచలన నిర్ణయం.. తల్లిదండ్రులు మొదట షాక్ అయినా ఆఖరికి ఒప్పుకుని…!!

13 ఏళ్ల అమ్మాయి సంచలన నిర్ణయం.. తల్లిదండ్రులు మొదట షాక్ అయినా ఆఖరికి ఒప్పుకుని…!!

by Megha Varna

Ads

13 ఏళ్ల అమ్మాయికి వచ్చిన ఆలోచన చూసి తల్లిదండ్రులు మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా ఊకొట్టారు. ఇప్పుడు ఆమె అనుకున్నట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే..

Video Advertisement

రాజస్థాన్ లోని రాజసమంద్ జిల్లా, లంబాడి ప్రాంతానికి చెందిన అంకిత్ వ్యాపారవేత్త. ఇతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె శివాంగి. శివాంగి కి 13 సంవత్సరాలు. ఈ వయసులో ఈమె అతి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది.

దానిని విన్న తల్లిదండ్రులు మొదటి షాక్ అయినా సరే ఆఖరికి కూతురు తీసుకున్న నిర్ణయానికి ఊకొట్టారు. ఇంతకీ ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటంటే సన్యాసినిగా మారాలని. సన్యాసిని దీక్ష తీసుకోవడం కోసం ఇప్పుడు తల్లిదండ్రులు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.

46 మంది సాధ్వి, సాధువుల సమక్షంలో 17వ తారీఖున శివాంగి సన్యాసినిగా మారబోతుంది.  చిన్నప్పటి నుండి కూడా ఈమెకి మతాలకు సంబంధించిన రచనలు చదవడం అంటే ఆసక్తి ఎక్కువ. ఈమె సెయింట్ పాల్ స్కూల్ లో నాలుగో తరగతి వరకే చదివి ఆ తర్వాత చదువు మానేసింది.

ఈ చిన్నారి కొన్ని రోజుల క్రితం జరిగిన సాధువులతో కలిపి ఆరు నెలల పాటు నాలుగు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసింది. అయితే ఈమె సన్యాసినిగా మారాలని తల్లిదండ్రులకు చెప్పింది. మొదటి తన అభిప్రాయాన్ని చూసి షాక్ అయ్యారు. కానీ తర్వాత ఒప్పుకున్నారు. ఇలా శివాంగి ఆఖరికి 17న జైన సన్యాసిగా దీక్ష తీసుకోబోతోంది. అయితే నిజానికి పదమూడేళ్ల వయసు వాళ్లకి ఇలాంటి ఆలోచనలు రావు. కానీ శివాంగి మాత్రం ఒక పెద్ద నిర్ణయాన్ని పదమూడేళ్లకే తీసేసుకుందంటే గొప్ప విషయమే.


End of Article

You may also like