ఈ 15 మంది సినీ తారలకు ఉన్న వింత ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసా?

ఈ 15 మంది సినీ తారలకు ఉన్న వింత ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసా?

by Mohana Priya

Ads

సాధారణం గా సినిమావాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా మనుషులే అని వాళ్లకి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోతాం. మన సెలబ్రిటీలు ఎంతోమంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. వాటిల్లో కొన్ని ఆరోగ్య సమస్యల పేర్లు మనం విని కూడా ఉండము. అంత అరుదుగా వచ్చే ఆరోగ్య సమస్యలు అవి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రిటీలలో కొంతమంది వీరే.

Video Advertisement

#1 అమితాబ్ బచ్చన్ – మయాస్థేనియా గ్రేవీస్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మయాస్థేనియా గ్రేవీస్ అనే వ్యాధి తో పోరాడారు. ఈ వ్యాధి వల్ల ఎముకలు బలహీనంగా అయిపోయి చూడడానికి, నడవడానికి, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు.

#2 ఇలియానా -బాడీ డిస్మోర్ఫిక్ డిసార్డర్

ఇలియానా బాడీ డిస్మోర్ఫిక్ డిసార్డర్ అని వ్యాధితో చాలాకాలం బాధపడ్డారు. ఈ వ్యాధి వల్ల తమపై తమ కి నమ్మకం పోయి, ఏమి సాధించలేము ఏమో అనే భయంతో, చూడడానికి ఎలా ఉంటాము అని ఇన్ సెక్యూరిటీ వంటివి వస్తాయట. ఒక్కొక్కసారి ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయట.

#3 పరిణీతి చోప్రా – డిప్రెషన్

పరిణితి చోప్రా కూడా తన వ్యక్తిగత సమస్యల వల్ల చాలా కాలం డిప్రెషన్ తో బాధ పడ్డారు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

#4 రజినీకాంత్ – బ్రోన్చైటిస్

శ్వాస పరమైన ఇబ్బందుల వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయ్యే ఈ వ్యాధితో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కొంతకాలం బాధపడ్డారు.

#5 నయనతార – చర్మ సమస్యలు

నయనతార మేకప్ వాడడం వల్ల వచ్చే చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కున్నారు.

#6 సోనమ్ కపూర్ – డయాబెటిస్

ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ కి 17 ఏళ్ల వయసున్నప్పుడు డయాబెటిస్ ఉన్నట్టు తెలిసింది. అంతేకాకుండా  సినిమాల్లోకి రాకముందు సోనమ్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది.

#7 సమంత – చర్మ సంబంధిత సమస్యలు

2013లో సమంత చర్మానికి సంబంధించిన అలర్జీ తో బాధపడ్డారు. కొంత కాలానికి కోలుకున్నారు. అంతేకాకుండా సమంతకి డయాబెటిస్ కూడా ఉంది అని వార్తలు వచ్చాయి.

# 8 దీపికా పదుకోన్ – డిప్రెషన్

అసలు డిప్రెషన్ గురించి సెలబ్రిటీలలో ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి దీపిక. మామూలుగా స్టార్స్ తమ సమస్యలను బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు బలహీనులు అని జనాలు అనుకుంటారేమో అన్న భయం ఉంటుంది. అలాంటి సమయంలో దీపిక తనకి మానసిక బలం చాలా తక్కువ అని, జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉండేది అని చెప్పింది.

#9 సోనాలి బింద్రే – మెటాస్టాటిక్ క్యాన్సర్

శరీరంలో ఒక భాగం నుండి మరో భాగానికి పాకే ఈ మెటాస్టాటిక్ క్యాన్సర్ తో పోరాడి గెలిచారు సోనాలి బింద్రే.

#10 అనుష్క శర్మ – ఆంగ్జైటీ 

అనుష్క శర్మ చాలాకాలం ఆంగ్జైటీ తో బాధపడ్డారని సోషల్ మీడియాలో తెలిపారు. అంతే కాకుండా దీని గురించి ప్రజలలో ఇంకా అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

#11 వరుణ్ ధావన్ – డిప్రెషన్

బద్లాపూర్ సినిమా సమయంలో క్యారెక్టర్ కోసం ఎక్కువ ఇన్వాల్వ్ అవడంతో (మెథడ్ యాక్టింగ్)  డిప్రెషన్ లోకి వెళ్ళాడు వరుణ్ ధావన్. తర్వాత డాక్టర్ల సహాయంతో కోలుకున్నాడు.

#12 సల్మాన్ ఖాన్ – ట్రైజెమినల్ న్యూరాల్జియా 

ముఖం నుండి మెదడు కి కనెక్ట్ అయిన ఒక నరం ఎఫెక్ట్ అయ్యి నములుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, బ్రష్ చేసుకుంటున్నప్పుడు ముఖం అంతా నొప్పిగా అనిపించే ఈ వ్యాధితో సల్మాన్ ఖాన్ బాధపడ్డారు.

#13 మనీషా కొయిరాలా – క్యాన్సర్

2012లో క్యాన్సర్ తో పోరాడి గెలిచారు మనీషా కొయిరాలా.

#14 షారుక్ ఖాన్ – డిప్రెషన్

2010లో ఒక ఇంటర్వ్యూలో ఒక గాయం కారణంగా తను బాధతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను అని, సర్జరీ తర్వాత తన గాయం నుండి కుటుంబం సహాయంతో డిప్రెషన్ నుండి కోలుకున్నాను చెప్పారు.

#15 కమల్ హాసన్ – టైప్ వన్ డయాబెటిస్

శరీరంలో గ్లూకోస్ మోతాదు తగ్గి ఇమ్యూన్ సిస్టం సరిగా ఉండకపోవడం, ఎక్కువ ఆకలి వేయడం, ఏదీ స్పష్టంగా కనిపించకపోవడం ఈ డయాబెటిస్ యొక్క లక్షణాలు. కమల్ హాసన్ టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఈ టైప్ 1 డయాబెటిస్ పూర్తిగా తగ్గడం అనేది ఉండదు. గ్లూకోజ్ మోతాదు తగ్గిన ప్రతి సారి ఇన్సులిన్ సహాయంతో మళ్లీ మామూలు స్థితికి వస్తారు.

source: wirally

 


End of Article

You may also like