ఈ 16 మంది బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలివే.!

ఈ 16 మంది బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలివే.!

by Mohana Priya

Ads

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.

Video Advertisement

కింగ్ నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నిన్న గ్రాండ్ గా మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ని రివీల్ చేశారు. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కాబట్టి కొంతమంది డాన్స్ పర్ఫామెన్స్ తో, ఇంకొంతమంది ఇంట్రడక్షన్ వీడియో తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

వీళ్లలో చాలామంది మనకి తెర మీద సుపరిచితులే. కానీ వాళ్ల తెర వెనుక జీవితం గురించి మాత్రం ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ ద్వారా సెలబ్రిటీ అనే ట్యాగ్ పక్కన పెట్టి కంటెస్టెంట్స్ గా మన ముందుకు వస్తున్నారు. ఒకసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది బ్రీఫ్ గా చూసేద్దాం.

#1 మోనాల్‌ గజ్జర్‌

అహ్మదాబాద్ కి చెందిన మోనాల్‌ గజ్జర్ సుడిగాడు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత వెన్నెల 1 1/2, ఒక కాలేజ్ లవ్ స్టోరీ, బ్రదర్ అఫ్ బొమ్మాళి తో పాటు హిందీ, మలయాళం, తమిళ్, మరాఠి, గుజరాతి సినిమాల్లో కూడా నటించారు.

#2 సూర్య కిరణ్

సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ సిక్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సూర్య కిరణ్ బాలనటుడిగా ఎన్నో సినిమాలు చేశారు.

#3 మెహబూబ్

సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే వాళ్లకి మెహబూబ్ తెలిసే ఉండొచ్చు. ఇంస్టాగ్రామ్ లో ,టిక్ టాక్ లో, తన డాన్స్ వీడియోస్ తో మెహబూబ్ చాలా పాపులర్ అయ్యారు.

#4 జోర్దార్ సుజాత

హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే జోర్దార్ వార్తలు లో న్యూస్ ప్రెజెంటర్ గా తనదైన శైలిలో మన అందరిని అలరిస్తారు సుజాత.

#5 అలేఖ్య హారిక

యూట్యూబ్ లో దేత్తడి ఛానల్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ ఛానల్ లో సాధారణంగా మనం రోజూ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను సరదాగా చూపిస్తూ ఎంతో పాపులర్ అయ్యారు హారిక. సెటైరికల్ గా అందర్నీ నవ్వించేలా ఉండే ఈ వీడియోస్ ద్వారా ఎంతోమందికి చేరువయ్యారు.

#6 కరాటే కళ్యాణి

ఎన్నో సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషించారు కరాటే కళ్యాణి. అందులో కృష్ణ సినిమాలో కళ్యాణి పోషించిన పాత్ర, ఇంకా మిరపకాయ్ సినిమా లో లెక్చరర్ పాత్ర కళ్యాణి కి పాపులారిటీ తెచ్చాయి. కల్యాణి నటి మాత్రమే కాకుండా సింగర్ కూడా. ఛత్రపతి సినిమాలో మన్నేల తింటివిరా క్రిష్ణా పాటని స్మిత తో కలిసి పాడారు కళ్యాణి.

#7 లాస్య

లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా ఎన్నో షోస్ చేశారు లాస్య. గత కొంతకాలంగా బ్రేక్ లో ఉన్న లాస్య ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో కళ్యాణ్ రామ్ చెల్లెలుగా చేశారు. తర్వాత యూట్యూబ్ లో తన ఛానల్ ద్వారా మనందరినీ అలరిస్తున్నారు.

#8 దేవి నాగవల్లి

దేవి నాగవల్లి కూడా పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంతోపాటు, ఎన్నో చోట్ల కి వెళ్లి న్యూస్ రిపోర్ట్ చేశారు. 2009, 2010 సంవత్సరాల్లో నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు.

#9 నోయల్

నోయల్ రాపర్ మాత్రమే కాకుండా, కుమారి 21 ఎఫ్, రంగస్థలం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఈగ, ప్రేమమ్, హలో గురు ప్రేమ కోసమే, పడి పడి లేచే మనసు ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.

#10 అభిజిత్

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో శ్రీను పాత్రలో నటించిన అభిజిత్, తర్వాత మిర్చి లాంటి కుర్రాడు, రామ్ లీలా (తెలుగు) సినిమాలతో పాటు పెళ్లిగోల వెబ్ సిరీస్ కూడా చేశారు.

#11 దివి

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించారు దివి. మహర్షి సినిమాలో ఒక పాత్రలో కనిపించారు.

#12 సయ్యద్ సోహెల్ రియాన్

కృష్ణవేణి, నాతి చరామి సీరియల్స్ తో పాపులర్ అయిన సయ్యద్ సోహెల్ రియాన్, యురేకా, మ్యూజిక్ మ్యాజిక్, సినీ మహల్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.

#13 అమ్మ రాజశేఖర్

ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ చేసిన అమ్మ రాజశేఖర్ రణం, ఖతర్నాక్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఒక రియాలిటీ షో లో జడ్జ్ గా కూడా వ్యవహరించారు.

#14 అరియానా గ్లోరీ

అరియానా గ్లోరీ టీవీ లో మాత్రమే కాకుండా, యూట్యూబ్ లో కూడా యాంకర్ గా అందరికీ సుపరిచితులు. ఎంతో మంది సెలబ్రిటీలను తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేసి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు అరియానా గ్లోరీ .

#15 గంగవ్వ

యూట్యూబ్ లో మై విలేజ్ షో అనే ఛానల్ లో చేసిన వీడియోల ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు గంగవ్వ. ఆ తర్వాత సమంత,నందిని రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ టీం, కాజల్ అగర్వాల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా ఎంతోమందిని ఇంటర్వ్యూ కూడా చేశారు.

#16 అఖిల్ సార్థక్

ఎవరే నువ్వు మోహిని, బంగారు గాజులు, ముత్యాల ముగ్గు, కల్యాణి సీరియల్స్ తో అందరికీ సుపరిచితులు అయ్యారు అఖిల్ సార్థక్.


End of Article

You may also like