21 ఏళ్ల ఎంబీఏ యువతి అదృశ్యం.. బై అని మెసేజ్ పెట్టి…చివరికి.?

21 ఏళ్ల ఎంబీఏ యువతి అదృశ్యం.. బై అని మెసేజ్ పెట్టి…చివరికి.?

by Megha Varna

Ads

అక్కా బావలతో ఉంటూ ఎంబీఏ విద్యార్థిని అక్కడే చదువుకుంటోంది. అయితే ఆమె ఈ నెల 15న కనబడలేదు. ఆమె అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఇక అసలు ఏమైంది అనేది చూస్తే… 15న కనపడకుండా వెళ్లి పోయిన అమ్మాయి గురించి పోలీసులకు కంప్లైంట్ చేయగా.. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Video Advertisement

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ లో చోటు చేసుకుంది. స్నేహితురాలికి ఆఖరికి ఆమె బాయ్ అని పెట్టిన మెసేజ్ ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొన్నారు. పోలీసులు ఫైనల్ గా ఇంటికి తీసుకెళ్లి అప్పగించారు. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే…

ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం…మాన్సీ బంగా అనే యువతి తన అక్క బావలతో కలిసి ఇంట్లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. అయితే ఆమెను వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తున్నారని ఆమెకి కోపం వచ్చింది. అలానే ఎప్పుడూ కూడా వాళ్ళు ఆమెని గమనిస్తూ ఉండడంతో విసిగిపోయి ఇంట్లో నుంచి పారిపోయింది.

ట్రైన్ లో చండీగర్ వెళ్లి అక్కడి నుండి ఫ్లైట్లో సూరత్ వెళ్ళింది. అక్కడ తన స్నేహితురాలి సహాయంతో ఒక సెలూన్ లో ఉద్యోగాన్ని సంపాదించింది. అక్కడ నుంచే తన స్నేహితురాలికి బాయ్ అని ఒక మెసేజ్ పెట్టింది. అయితే ఈ మెసేజ్ పోలీసులకు ఎంతగానో ఉపయోగపడింది. సూరత్ నుండి మెసేజ్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్ గా ఉత్తరప్రదేశ్ కి తీసుకు వెళ్లి ఆమెని అప్పగించారు.

 


End of Article

You may also like