Ads
మనకి అసహనం తెప్పించే విషయాల్లో ఆన్లైన్లో పేమెంట్ నిలిచిపోవడం ఒకటి. పేమెంట్ ప్రాసెస్ కానప్పుడు మనము ఆ బటన్ ని ఒక రెండు మూడు సార్లు నొక్కుతాం. అప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఒక వ్యక్తి ఇలా అసహనంలో చేసిన పని అతనికి 1.4 మిలియన్ యూరోల (దాదాపుగా రూ.12 కోట్లు) నష్టం తెచ్చిపెట్టింది.
Video Advertisement
జర్మనీకి చెందిన ఒక వ్యక్తి కార్ కొనుక్కోవాలని అనుకున్నాడు. ఆన్లైన్లో లో అంటే కంపెనీ వెబ్సైట్లో టెస్లా మోడల్ 3 కారు ను బుక్ చేశాడు. పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి వెబ్సైట్ ఆగిపోయింది. ఎన్నిసార్లు ఏ బటన్ నొక్కినా కూడా ముందుకు వెళ్లట్లేదు. దాంతో కోపం వచ్చిన ఆ వ్యక్తి పేమెంట్ బటన్ ని చాలాసార్లు నొక్కాడు.
తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. కానీ ఆ పేజీ చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దానికి కారణం బుక్ అయింది ఒక్క కారు కాదు 28 కార్లు. ఇంకా అతను డబ్బులు కట్టింది కూడా 28 కార్లకి. దాంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. కంపెనీ వాళ్ళని సంప్రదించాడు.
ముందు ఒకసారి డబ్బులు కట్టడం అయిపోతే మళ్ళీ వెనక్కి ఇవ్వడం కష్టం అని అన్నారు. ఒకవేళ డబ్బులు వెనక్కి ఇచ్చినా కూడా అందులోని వంద యూరోలు తమ దగ్గర పెట్టుకుని మిగిలిన డబ్బులు ఇచ్చేస్తారు. కానీ తప్పు కంపెనీ వెబ్సైట్ ది కాబట్టి మొత్తం 28 కార్లకి కట్టిన డబ్బులను ఆ వ్యక్తికి వెనక్కి ఇచ్చేశారు.
డబ్బులు వెనక్కి వచ్చాయి కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత నష్టం వచ్చేది? మీరు కూడా ఈ సారి అలా పేమెంట్ ఆగిపోయినప్పుడు వెంటవెంటనే ఆ బటన్ ప్రెస్ చేయకుండా కొంచెం ఓపికగా వేచి చూడండి. అన్ని కంపెనీలు ఇంత సులువుగా డబ్బులు వెనక్కి ఇచ్చే అవకాశం ఉండదు.జీవితంలోనే కాదు ఆన్లైన్ షాపింగ్ లో కూడా ఓపిక అవసరమే అని అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.
తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం!
>>>CLICK HERE FOR DETAILS<<<
End of Article