Home News “నాన్న ఎప్పుడొస్తావ్?” అంటూ నెలరోజులుగా చిన్నారి ఫోన్…కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!

“నాన్న ఎప్పుడొస్తావ్?” అంటూ నెలరోజులుగా చిన్నారి ఫోన్…కంటతడి పెట్టిస్తున్న సంఘటన.!

by Mohana Priya

చిన్న వయసులో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు కనిపించకపోతే పిల్లలు చాలా ఆందోళన చెందుతారు. వారు ఎక్కడ ఉన్నారో అని మొత్తం వెతుకుతారు. ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతూ ఉంటారు. వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయినా కానీ ఆ పిల్లలకి అర్థం అవ్వదు. ఇలాంటి ఘటన ఒకటి ఇటీవల చోటు చేసుకుంది.

3 year old girl waiting for her father in Karnataka

వివరాల్లోకి వెళితే ఈటీవీ భారత్ కథనం ప్రకారం సమ్య కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని భద్రావతి మండలం హోసకొప్ప కి చెందిన సమ్య శరణ్ కూతురు. సమ్య పుట్టిన సంవత్సరానికి తన తల్లి మరణించారు. అప్పటి నుంచి శరణ్ సోదరి అయిన అఖిల సహాయంతో సమ్యని చూసుకుంటున్నారు.

3 year old girl waiting for her father in Karnataka

బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే శరణ్, గత సంవత్సరం లాక్ డౌన్ కారణంగా శివమొగ్గకి వచ్చారు. సంస్కృతి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి కోవిడ్ తో ఇబ్బంది పడుతున్న వారికి సహాయం అందించారు. గత నెల కరోనా సోకడంతో శరణ్ మరణించారు.

3 year old girl waiting for her father in Karnataka

దాంతో సమ్య అఖిల వద్ద ఉంటోంది. తన తండ్రికి రోజుకి నాలుగైదు సార్లయినా ఫోన్ చేస్తుంది. ఇంటికి తిరిగి రమ్మని అడుగుతుంది. అంతే కాకుండా తన తండ్రి ఇంటికి తిరిగి రావాలి అని దేవుడికి పూజలు కూడా చేస్తూ ఉంటుంది. తన తండ్రి చనిపోయినట్టు పాపకి తెలియదు అని అఖిల వివరించారు.

You may also like