Ads
ఇటీవల విడుదలై యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. 30 సంవత్సరాల వయసున్న అతనికి 21 సంవత్సరాల వయసున్న అమ్మాయితో పెళ్లి అయితే ఎలా ఉంటుందో, వారి ఇద్దరి ఆలోచనలు ఎలా ఉంటాయో చూపించడమే ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా వాళ్ళిద్దరు ఫేస్ చేసే సమస్యలని ఫన్నీగా చూపిస్తున్నారు.
Video Advertisement
అందులో ఉన్న పాత్రలు డైలాగ్స్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ ని చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ సిరీస్ ని చాయ్ బిస్కెట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఒక కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. అలా ఇప్పటికి నాలుగు ఎపిసోడ్లు విడుదల అయ్యాయి.
30 words 21 hero Chaitanya in premam
ఈ సిరీస్ లో అనన్య హీరోయిన్ గా నటించగా, చైతన్య హీరోగా నటిస్తున్నారు. అయితే చైతన్య అంతకుముందు ఎన్నో ఆడిషన్స్ ఇచ్చారట. చైతన్యకి స్క్రీన్ మీద కనిపించడం ఇది మొదటిసారి కాదు. నాగ చైతన్య హీరోగా వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమమ్ రీమేక్ అయిన ప్రేమమ్ లో ఒక పాత్రలో కనిపిస్తారు చైతన్య.
30 words 21 hero Chaitanya in vakeel saab
శృతి హాసన్ ఎపిసోడ్ లో హీరో క్లాస్ లోకి వెళ్ళిన తర్వాత, హీరో పక్క బెంచ్ అతను తుమ్మితే హీరో తన చేతిలో ఉన్న ఆల్కహాల్ ని కేరళ మందు అని చెప్పి ఇస్తాడు. హీరో పక్క బెంచ్ లో కూర్చున్న వ్యక్తి చైతన్య. అలాగే వకీల్ సాబ్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించారు చైతన్య. ప్రస్తుతం చైతన్య ఈ వెబ్ సిరీస్ ద్వారా మనల్ని అలరిస్తున్నారు.
End of Article