గతనెల మూడో తేదీన సోషల్​ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్​ అయ్యింది. ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర నిలబడిన ఫొటో అది.ఈ ఫొటో వెనుక గుండెను బరువెక్కించే విషాదకరమైన కథ ఉంది.ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం.అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది.తమిళనాడులోని సేలంకు చెందిన సెల్వం, ప్రేమ దంపతులకు ముగ్గురు పిల్లలు. సెల్వం, ప్రేమ ఇటుక బట్టీలో పని చేస్తుండేవారు. సొంతంగా వ్యాపారం చేయడానికి సెల్వం అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఆ అప్పు రూ. 2.5 లక్షలు అయింది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కొందరు మోసగించారు. దీంతో ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి ముగ్గురు బిడ్డలు వీదిన పడ్డారు.ఇంట్లో అన్ని అమ్మేసి అప్పులకు కట్టేసింది. తమకంటూ ఏమి మిగల్లేదు. ఉండటానికి గూడు తప్ప.. బంధువులు, ఇరుగుపొరుగు వారు పట్టించుకోలేదు.

బిడ్డల ఆకలి కేకలను చూడలేక అల్లాడిపోయింది. ఇంతలో వెంట్రకులు కొంటామంటూ పిలుపు వినిపించింది. అంతే.. ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి తన జుట్టును కత్తిరించి తీసుకొచ్చి అమ్మేసింది. ఆ జుట్టుకు అతడు రూ.150 ఇచ్చాడు. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి ఇంట్లోకి బియ్యం, సరుకులు తెచ్చింది. పొయ్యి వెలిగించి అన్నం వండి పిల్లలకు కడుపునిండా పెట్టింది.ప్రేమ ఆకలి కష్టాలు తెలుసుకున్న బాలా అనే గ్రాఫిక్ డిజైనర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు చలించి ఆమెకు రూ.1.45 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆ మొత్తాన్ని ప్రేమకు ఇచ్చాడు.. ఇటుకబట్టీలో పనికి కూడా కుదిర్చాడు. ప్రేమ పరిస్థితి గురించి తెలిసిన సేలం జిల్లా అధికారులు కూడా స్పందించి వితంతు పింఛన్ మంజూర్ చేశారు. ప్రభుత్వం ప్రేమకు వితంతు పెన్షన్‌ను మంజూరు చేసింది.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics
Sharing is Caring:
No more articles