Ads
ఆమె గొంతు ఒక అద్భుతం. వెంటవెంటనే ఆడ గొంతు నుంచి మగ గొంతుకు, మగ గొంతు నుంచి ఆడ గొంతుకు మార్చగలదు. సెలబ్రెటీ వాయిస్‌లను కూడా వెంటవెంటనే మారుస్తూ మాట్లాడగలదు, పాడగలదు. నాలుగు సెకన్లకు ఒక గొంతు మారుస్తూ.. కేవలం 4 నిమిషాల్లో 51 మంది సెలబ్రెటీల గొంతులను మిమిక్రీ చేసి ఔరా అనిపించింది మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న అఖిల. ఈ మధ్య మలయాళ టీవీ చానల్లో ప్రసారమైన ఓ షోలో అఖిల ఈ ఫీట్‌ను చేసింది.ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నఅఖిలకు చిన్నప్పటినుంచి మిమిక్రీ చేయడమంటే ఎంతో ఇష్టం.
Video Advertisement
4 minutes 51 Voices Great mimicry By Kerala Girl
అఖిల తిరువనంతపురం జిల్లాలోని నెదుమంగడ్కు చెందినది. తాను మొదటగా మిమిక్రీ చేసింది గాయకురాలు జానకమ్మదని ఆమె తెలిపింది. జానకమ్మ పాడిన ‘అజకాదల్’ పాటతో మిమిక్రీ చేసినట్లు అఖిల తెలిపింది. అఖిల చాలా సందర్భాల్లో నటులు ఆసిఫ్ అలీ మరియు రంజిని హరిదాస్ వాయిస్‌లను మిమిక్రీ చేసినట్లు, ఆ విషయం వారిద్దరికి తెలిసి తనను మెచ్చకుంటూ ఎంతో సంతోషించారని ఆమె తెలిపింది.
End of Article