నాన్నా అమ్మని లేపు అంటూ 5 ఏళ్ల చిన్నారి…కంట తడి పెట్టిస్తున్న సంఘటన!

నాన్నా అమ్మని లేపు అంటూ 5 ఏళ్ల చిన్నారి…కంట తడి పెట్టిస్తున్న సంఘటన!

by Megha Varna

Ads

ఇషాంత్ ,రేఖ దంపతులు ..వీరికి ఆరుషి అనే ఐదు సంవత్సరాల కూతురు ..రేఖ చనిపోయింది ..ఆ విషయం ఆరుషి కి తెలియక తన తండ్రి దగ్గరకి వెళ్లి ..నాన్న ఒకసారి అమ్మను లేపు ..అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంటే ..ఆ చిన్నారి బాధను తీర్చలేక ..భార్యకు అంతిమ సంస్కారాలు జరపలేక ..ఏమి చెయ్యాలో దిక్కు తోచక ఆ బాధను తనలోనే ఉంచుకుంటూ రోజంతా గడిపేశాడు ఆ తండ్రి .భార్య మృత దేహాన్ని ఇంట్లోనే ఉంచుకొని కనీసం ఎవరిని సాయం అడగలేకపోయాడు ..అతని పరిస్థితిని చూసి ఓ పోలీస్ కానిస్టేబుల్ సహాయం అందించడంతో దహన కార్యక్రమాలు పూర్తి చేసారు ..

Video Advertisement

ఇషాంత్ చార్మినార్ దగ్గరలోని ఓ మందుల షాప్ లో గుమస్తాగా పని చేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు .మూడు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో ఇషాంత్ కుడి కాలు పూర్తిగా విరిగిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు..భర్త వైద్యం కోసం రేఖ చాలా మందిని సహాయం అడిగింది .మూడు నెలల పాటు అందిన కాడికి అప్పులు చేసి కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూనే ఇషాంత్ కు వైద్యం అందించింది .ఇషాంత్ కొద్దిగా కోలుకొని ఆ కాలుతోనే పనిలోకి వెళ్దాం అనుకునే సమయానికి కరోనా లాక్ డౌన్ వార్త పిడుగులా పడింది ..దీంతో మళ్ళి ఇంటికే పరిమితమయ్యాడు .తెల్ల రేషన్ కార్డు లేదు.ఎవరినైనా సాయం అడిగేందుకు ఆత్మాభిమానం ఒప్పుకోలేదు .దీంతో చాలీచాలని ఆకలితోనే బతికారు .

ఈ నేపథ్యంలో అప్పులు బాగా పెరిగిపోవడం ,కుటుంబ పోషణ కష్టం అయిపోవడం ,భర్త ఆరోగ్య పరిస్థితి వీటితో రేఖ మనో వేదనకు గురయ్యింది ..దీంతో సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది రేఖ ..దీంతో విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని తన సొంత ఖర్చులతో అంత్య క్రియలు జరిపించారు.స్థానికులు ,దాతలు కొంత డబ్బును ఇషాంత్ కు అందచేశారు .మూడు నెలల నిత్యావసర సరుకులు వేయించి ఆ చిన్నారి ఆలనా పాలన తన బాధ్యత అంటూ భరోసా ఇచ్చిన కానిస్టేబుల్ శ్రీనన్న గొప్ప మనసును మెచ్చుకోవాల్సిందే .

source: sakshi


End of Article

You may also like