చెల్లెలి కోసం కుక్కతో 6 ఏళ్ల బాలుడి ప్రాణాలకు తెగించి పోరాటం…మొహానికి 90 కుట్లు..!

చెల్లెలి కోసం కుక్కతో 6 ఏళ్ల బాలుడి ప్రాణాలకు తెగించి పోరాటం…మొహానికి 90 కుట్లు..!

by Mohana Priya

Ads

వయసుకి పరిణితికి సంబంధం లేదు అంటారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన గురించి వింటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. యుఎస్ కి చెందిన బ్రిడ్జర్ వాకర్ అనే ఆరేళ్ల అబ్బాయి తన చెల్లెలు వెనకాల కుక్కలు పడితే తన గురించి కూడా లెక్క చేయకుండా వెళ్లి చెల్లెలిని కాపాడాడు. ఈ సంఘటన జులై 9న చోటు చేసుకుంది.

Video Advertisement

 

బ్రిడ్జర్ వాకర్ ని కుక్కలు కరిచాయి. అతని ముఖం మీద కూడా బాగా గాయాలు అయ్యాయి. తీవ్రంగా దెబ్బలు తగలడంతో బ్రిడ్జర్ కి 90 కుట్లు పడ్డాయి. బ్రిడ్జర్ బంధువు నికోల్ వాకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆవిడ తన పోస్టులో సూపర్ హీరో పాత్ర పోషించిన నటులు అందరిని టాగ్ చేశారు.

“నా మేనల్లుడు ఒక హీరో. తన చెల్లెలిని కుక్కల నుండి కాపాడాడు అతనికి ఎన్ని దెబ్బలు తగిలినా లెక్కచేయకుండా తన చెల్లెలు చేయిపట్టుకుని ఆ కుక్కల నుండి దూరంగా తీసుకెళ్లాడు. ఒకవేళ మా ఇద్దరి లో ఎవరైనా చనిపోవాల్సి ఉంటే అది నేనే అవ్వాలి అని అనుకున్నాను అని చెప్పాడు. సూపర్ హీరోల జాబితాలో ఇంకొక అతను కూడా వచ్చాడు అని సూపర్ హీరోలు అందరికీ తెలియాలి అని నేను వాళ్లందరినీ ఈ పోస్టులో ట్యాగ్ చేశాను. నేను బ్రిడ్జర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బ్రిడ్జర్ దెబ్బలు మునుపటికంటే తగ్గాయి. మా అందరి పై ఇంత ప్రేమ చూపించినందుకు ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు” అని పోస్ట్ కింద క్యాప్షన్ లో రాశారు.

హల్క్ పాత్ర పోషించిన మార్క్ రుఫలో ” బ్రిడ్జర్ , జరిగిన దాని గురించి నేను చదివాను. నీ ధైర్యాన్ని చూస్తే నాకు నీ మీద గౌరవం పెరిగింది. ధైర్యం అంటే మన చుట్టుపక్కల వాళ్లందరినీ బెదిరించడం లేదా అదుపులో పెట్టుకోవడం కాదు. ధైర్యం అంటే ఏ పరిస్థితిలో ఏది చెయ్యాలో తెలుసుకోవడం. ఒకవేళ ఆ పని చేస్తే ఏమైనా జరిగే ప్రమాదం ఉన్నాకూడా ముందడుగు వేసి అవతల వాళ్ళని కాపాడటం” అని సోషల్ మీడియా ద్వారా బ్రిడ్జర్ కి సందేశం పంపారు.

అన్నే హాత్వే కూడా బ్రిడ్జర్ కథను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. కెప్టెన్ అమెరికా పాత్ర పోషించిన క్రిస్ ఎవాన్స్ కూడా బ్రిడ్జర్ తో మాట్లాడి కెప్టెన్ అమెరికా షీల్డ్ ను బ్రిడ్జర్ కి ఇస్తానని ప్రమాణం చేశారు.

https://www.instagram.com/tv/CCrmxv1gTek/?utm_source=ig_web_copy_link

తమ గురించి మాత్రమే ఆలోచించుకునే ఈ రోజుల్లో అంత చిన్న వయసులో ధైర్యంగా వెళ్లి ఇంత సాహసం చేశాడు అంటే బ్రిడ్జర్ నిజంగా ఒక సూపర్ హీరో నే. బహుశా ఉత్తమ అన్న అనే అవార్డు ఏమైనా ఉంటే ఆ అవార్డు ని కచ్చితంగా బ్రిడ్జర్ కి ఇవ్వొచ్చు.


End of Article

You may also like