Ads
కాలం కలిసిరాక ఓ రిక్షా తొక్కుకొనే వ్యక్తి యాచకుడిగా మారాడు.ఈ నేపథ్యంలో పలు దేవాలయాల బయట కూర్చొని బిక్షాటన చేసేవాడు.అయితే తాను ఏ దేవాలయాల బయట కూర్చుకొని బిక్షాటన చేసాడో తిరిగి ఆ దేవాలయాలకు విరాళంగా తన దగ్గర ఉన్న డబ్బును ఇచ్చేసాడు.ఈ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే..
Video Advertisement
నల్గొండ జిల్లా చింతపల్లి కి చెందిన యాది రెడ్డి అనే వ్యక్తి రిక్షా తొక్కుతూ రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ లో నిడుస్తూ జీవనం సాగించేవారు. .అయితే ఒక్కసారిగా ఆరోగ్యం బాగుండకపోవడంతో గత 20 సంవత్సరాలుగా విజయవాడ లోని షిర్డీ సాయిబాబా ఆలయంతో పాటు పలు దేవాలయాల దగ్గర బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు.ఈ క్రమంలో తాను బిక్షాటన చేసిన డబ్బునంతా బ్యాంకు లో దాచుకొనేవాడు యది రెడ్డి.అయితే ఒక సమయంలో తన ఆరోగ్యం పూర్తిగా క్షించడంతో బ్రతికితే సాయిబాబు కి లక్ష రూపాయలు కానుకగా ఇస్తాను అని మొక్కుకున్నాడు.కాగా తిరిగి ఆరోగ్యం తిరిగి కుదుటపడడంతో లక్ష రూపాయల కానుకను సాయిబాబు దేవాలయానికి ఇచ్చారు.
అలాగే సాయిబాబా గుడిలో ఉన్న దత్తాత్రేయుడు కి ,అన్నదాన పథకానికి,కొబ్బరికాయలకు కూడా కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు యాది రెడ్డి.ఇదే విధంగా గోశాల నిర్మాణానికి 3 లక్షల రూపాయలు,దుర్గ మల్లేశ్వర స్వామి వారి సేవలకు 1 .10 రూపాయలు విరాళంగా ఇచ్చారు యది రెడ్డి.మొత్తంగా అన్ని దేవాలయాలకు కలిపి దాదాపు 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు యాదిరెడ్డి.బిక్షాటనతో వచ్చిన సొమ్ము ను తానే ఉంచుకోకుండా ఏ దేవాలయాల వలన డబ్బు వచ్చిందో తిరిగి అదే దేవాలయాలకు డబ్బు ఇచ్చిన యది రెడ్డి నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
End of Article