మాయమైన 7 కేజీల బంగారం… డిప్యూటీ మేనేజర్ ఆత్మహ-త్య…!

మాయమైన 7 కేజీల బంగారం… డిప్యూటీ మేనేజర్ ఆత్మహ-త్య…!

by Mounika Singaluri

శ్రీకాకుళం జిల్లా గార మండల కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లో బంగారం మాయమైంది. ఏకంగా ఏడు కిలోల బంగారు ఆభరణాలను మాయం చేసేశారు. అయితే ఈ ఘటన తర్వాత డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య కలకలం రేపింది. అయితే బంగారు ఆభరణాలను డిసెంబర్ 8వ తేదీన అందజేస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు.

Video Advertisement

ఇప్పుడు డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య తర్వాత పోలీసులను ఆశ్రయించారు.గార ఎస్‌బీఐ బ్రాంచిలో ఖాతాదారులు కుదువపెట్టిన ఏడు కిలోల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని.. వీటి విలువ రూ.4.07 కోట్ల పైబడి ఉంటుందని ఫిర్యాదు అందజేశారు.

బంగారం మాయం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ బంగారం మాయం వెనుక ఇంటి దొంగల పనేనని ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఈలోపు ఒక మహిళా ఉద్యోగి ఆత్మహ-త్యకు పాల్పడడం సంచలనంగా మారింది.అయితే ఆభరణాలు కుదువపెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు డబ్బులు చెల్లించినా వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో కొద్దిరోజులుగా అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నగలు గల్లంతయ్యాయనే ప్రచారంతో నవంబరు 27న ఖాతాదారులు ఆందోళనకు దిగారు.శ్రీకాకుళం ప్రాంతీయ అధికారి టీఆర్‌ఎం రాజు బ్యాంకుకు చేరుకుని, ఆడిట్‌ కారణంగా ఆలస్యమవుతోందని.. బంగారం మాయమైందనే వదంతులు నమ్మవద్దని ఖాతాదారులకు చెప్పారు.

డిసెంబరు 8 వరకు వేచి ఉంటే ఆభరణాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలో బ్యాంకులో బంగారంపై రుణాలిచ్చే బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజరు ఉరిటి స్వప్నప్రియ నవంబరు 29న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహ-త్యాయత్నానికి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయారు.
మనస్తాపంతో స్వప్నప్రియ ఆత్మహ-త్యకు పాల్పడినట్లు తల్లి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈలోపు ఖాతాదారుల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో తమ ఉద్యోగులపైనే అనుమానం ఉందని బ్యాంకు ప్రాంతీయ అధికారి రాజు, బ్రాంచ్ మేనేజర్ రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.4.07 కోట్ల విలువైన 7 కేజీల ఆభరణాలు కనిపించడంలేదని అందులో పేర్కొన్నారు.దీంతో గార ఎస్‌ఐబీలో రుణాలు తీసుకున్న సుమారు 2400 మంది ఖాతాదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. బంగారం పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఏడు కేజీల బంగారం కనిపించకుండాపోవడం చర్చనీయాంశమైంది.

 

Also Read:రైలులో మహిళతో వ్యక్తి అనుచిత ప్రవర్తన… ఆ మహిళ ఏం చేసింది అంటే…?


You may also like

Leave a Comment